For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మెల్‌బోర్న్‌లో నిలబడ్డ ఇంగ్లాండ్ 192/2: కుక్ సెంచరీ, ఆసీస్ 327 ఆలౌట్

By Nageshwara Rao
Alastair Cook scores 104no after Stuart Broad takes 4-61 as England boss day two at MCG

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లాండ్ పట్టు బిగించింది. ఆ జట్టు మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ (104 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది.

ప్రస్తుతం క్రీజులో అలెస్టర్ కుక్ (104, 116 బంతుల్లో 15 ఫోర్లు), జో రూట్ (49, 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. రెండో రోజైన బుధవారం ఓవర్ నైట్ స్కోరు 244/3తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 327 పరుగులు చేసిన ఆలౌటైంది.

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో స్టీవ్ స్మిత్ (76), షాన్ మార్ష్ (61) పరుగులతో హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా వారంతా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాండ్ నాలుగు, జేమ్స్ ఆండర్సన్ మూడు, క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీసుకోగా... టామ్ కరాన్ ఒక వికెట్ తీసుకున్నాడు.

ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా 2017 నాలుగో టెస్టు మ్యాచ్ స్కోరు కార్డు

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు స్కోరు 35 పరుగుల వద్ద ఓపెనర్ స్టోన్‌మన్ (15) ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్‌కు నేరుగా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జేమ్స్ విన్స్ (17) పరుగుల వద్ద హాజెల్‌ఉడ్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జో రూట్‌తో కలిసి ఓపెనర్ అలెస్టర్ కుక్ నిలకడగా ఆడుతూ పరుగులు సాధించాడు. ఈ క్రమంలో కుక్ టెస్టుల్లో 32వ సెంచరీని నమోదు చేశాడు. ఆసీస్ బౌలర్లలో హాజెల్ ఉడ్, నాథన్ లియాన్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక, ఎప్పటిలాగే రెండో రోజు కూడా మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌కు అభిమానులు పోటెత్తారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 27, 2017, 13:32 [IST]
Other articles published on Dec 27, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+