Alastair Cook: సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించడం ఇండియా వల్ల కాదు

లండన్‌: సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించడం టీమిండియా వల్ల కాదని ఆ జట్టు మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ అన్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌ ముగిసే సరికి కోహ్లీసేన మానసికంగా అలసిపోతుందని పేర్కొన్నాడు. ఈ రెండు జట్ల మధ్య పోటీ చావోరేవో అన్నట్టుగా ఉంటుందని అంచనా వేశాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ వల్ల భారత్‌ అత్యుత్తమంగా ఆడుతున్నట్టు కనిపిస్తోందని, కానీ ఐదు టెస్ట్ సిరీస్‌లో రాణించడం ఆ జట్టుకు శక్తికి మించిన పనేనని తెలిపాడు. తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడిన కుక్ అప్‌కమింగ్ ఐదు టెస్ట్‌ల సిరీస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మానసికంగా అలసిపోతుంది..

మానసికంగా అలసిపోతుంది..

'టీమిడియా చాలారోజులు ఇక్కడ ఉండనుంది. అందుకే పర్యటన ముగిసే సరికి మానసికంగా అలసిపోవచ్చు. కోహ్లీసేన ఆరంభం బాగానే ఉండొచ్చు. కానీ ఐదు టెస్టుల సిరీసులో నిలకడ చాలా కష్టం. సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించడం శక్తికి మించిన పని. అందుకే భారత్‌పై ఆరంభ మ్యాచులోనే పైచేయి సాధిస్తే రూట్‌ సేన గెలవకపోవడానికి కారణాలు కనిపించడం లేదు' అని కుక్‌ అన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ రొటేషన్‌ విధానం బాగాలేదని కుక్‌ విమర్శించాడు. భారత్‌లో 1-3, న్యూజిలాండ్‌ చేతిలో 1-0తో ఓడిపోవడంపై కుక్ స్పందించాడు.

పనికిమాలిన పని..

పనికిమాలిన పని..

ఆటగాళ్ల రొటేషన్ అనేది పనికిమాలిన పనని కుక్ విమర్శించాడు. ‘ఈ రొటేషన్ విధానం రూట్‌ను ఇబ్బంది పెడుతోంది. నేను నిజాయతీగా అతనిపై సానుభూతి చూపుతున్నాను. జట్టుకు కోచ్‌గా లేదా కెప్టెన్‌గా లేదా సెలక్టర్‌గా ఉంటే వారి పనితీరును ఫలితాల ఆధారంగానే విశ్లేషిస్తారు. కానీ రూట్‌కు అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం లేదు. అనుభవజ్ఞులైన బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, జానీ బెయిర్‌స్టో, మొయిన్‌ అలీ, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌వుడ్‌ వంటివాళ్లు లేకుండా గెలవడం కష్టం. రొటేషన్‌ వల్ల వీరంతా అందుబాటులో ఉండటం లేదు. పైగా ఆర్చర్‌, బెన్‌స్టోక్స్‌ వంటి ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి.'అని కుక్ చెప్పుకొచ్చాడు.

ఈ మార్పులు చేయవద్దు..

ఈ మార్పులు చేయవద్దు..

ఏదేమైనా టీమిండియా‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో డామ్‌ సిబ్లీ, జాక్‌ క్రాలీ, ఒలీ పాప్‌, డాన్‌ లారెన్స్‌తో కూడిన టాప్‌ ఆర్డర్‌లో మార్పులు చేయవదని కుక్‌ హెచ్చరించాడు. ఇక ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లండ్‌తో భారత్ ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అక్కడే ఉండనుంది. ఈ ఖాళీ సమయాన్ని ఇంగ్లండ్‌లో ఆస్వాదించనుంది. ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లీడ్‌లో న్యూజిలాండ్..

లీడ్‌లో న్యూజిలాండ్..

ఐదో రోజు ఆటలో భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న కివీస్ 32 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. భారత బౌలర్లు మహ్మద్ షమీ(4/76), ఇషాంత్ శర్మ(3/48), రవిచంద్రన్ అశ్విన్(2/28) ధాటికి కనీసం 200 పరుగుల మార్క్‌నైనా అందుకుంటుందా? అనే సందేహం కలిగింది. కానీ బౌలింగ్‌లో రఫ్ఫాడించిన కైల్ జెమీసన్(21), టీమ్ సౌథీ(30)బ్యాటింగ్ రాణించడం.. కెప్టెన్ కేన్ విలియమ్సన్(49) క్రీజులో పాతుకుపోవడంతో 99.2 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. జడేజా ఓ వికెట్ తీయగా.. బుమ్రా ఒక్క వికెట్ దక్కలేదు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, June 22, 2021, 21:53 [IST]
Other articles published on Jun 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X