For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్‌గా ఇదే చివరి సిరిస్: వార్తలపై స్పందించిన కుక్

By Nageshwara Rao

రాజ్ కోట్: ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కెప్టెన్‌గా అలెస్టర్ కుక్‌కు చివరిదంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు. రాజ్ కోట్‌లో తొలి టెస్టు సందర్భంగా అలెస్టర్ కుక్ మీడియాతో మాట్లాడాడు. భవిష్యత్తులో కెప్టెన్‌గా ఉన్నా, లేకపోయినా ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని ప్రకటించాడు.

రాజ్‌కోట్ టెస్ట్: ఇంగ్లాండ్ బ్యాటింగ్, కుక్‌కు రెండు లైఫ్‌లు

దీంతో బ్రిటిష్ మీడియా కెప్టెన్‌గా అలెస్టర్ కుక్‌కు భారత్ సిరిసే చివరదంటూ పెద్ద ఎత్తున కథనాలను ప్రచురించింది. తన కెప్టెన్సీపై మీడియా అడిగిన ప్రశ్నలకు గాను తాను నిజాయితీతో సమాధానమిచ్చానని తెలిపాడు. కెప్టెన్‌గా ఇంకెన్నాళ్లు కొనసాగుతారు అన్న ప్రశ్నకు తనకు తెలియదని సమాధానమిచ్చానని తెలిపాడు.

Alastair Cook rubbishes speculation of quitting as England skipper after India series

కాగా, ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు కెప్టెన్‌గా ఉన్న అలెస్టర్ కుక్ అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు. ఇంగ్లాడ్‌ తరఫున అత్యధిక టెస్టులకు నాయకత్వం వహించిన కెప్టెన్‌గా కుక్‌ అవతరించనున్నాడు.

ఇప్పటివరకు మాజీ కెప్టెన్‌ మైకెల్‌ అథర్టెన్‌ పేరిట ఉన్న 54 టెస్టుల రికార్డు రాజ్‌కోట్‌ వేదికగా జరిగే తొలి టెస్టుతో కుక్ అధిగమించనున్నాడు. 2012లో ఇంగ్లాండ్ జట్టుకు కుక్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. భారత్‌పైనే కుక్ తొలి విజయాన్ని నమోదు చేశాడు.

తాజా సిరిస్‌లో కూడా విజయం సాధించి ఇంగ్లాండ్‌కు మరో విజయాన్ని అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటివరకు 54 టెస్టులకు నాయకత్వం వహించగా, అందులో 24 విజయాలను నమోదు చేశాడు. ఇక కుక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ రెండు యాషెస్ సిరీస్‌లను కూడా సొంతం చేసుకుంది.

2006లో భారత్‌తో జరిగిన మ్యాచ్ ‌ అంతర్జాతీయ టెస్టు కెరీర్‌ను ఆరంభించిన కుక్.. అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. ఇప్పటివరకూ 135 టెస్టులు ఆడిన కుక్ 10,688 పరుగులను సాధించి ఈ ఫార్మాట్‌లో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+