Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యోయో: కుక్ పాసైయ్యాడోచ్..!!

Alastair Cook passes Yo-Yo Test, emerges as the fittest England cricketer - Watch

హైదరాబాద్: ఇప్పటికే విదేశీ పర్యటనలో ఉన్న భారత్‌తో రెండు సిరీస్‌లను పూర్తి చేసుకుంది ఇంగ్లాండ్ జట్టు. మరి కొద్ది రోజుల్లో మూడోదిగా మొదలుకాబోతున్న టెస్టు సిరీస్‌కు తమ దేశం ఆటగాళ్లను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో వాళ్లకు యోయో టెస్టును నిర్వహించి దానిలో పాసైన వాళ్లని మాత్రమే టెస్టు జట్లులోకి తీసుకోనున్నట్లు సమాచారం.

ఈసీబీ విడుదల చేసిన యోయో టెస్టు వీడియో

ఈ క్రమంలో ఇంగ్లాండ్ క్రికెటర్లకు యోయో టెస్టును నిర్వహించిన వీడియోను ఆ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది. ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ టెస్టులో నిర్ణీత దూరాన్ని ప్రయాణించి అలసిపోయిన వీడియోను ఉంచి టెస్టు సిరీస్‌కు సిద్ధమన్నట్లు పోస్టు చేసింది. టెస్టు జట్టులో సీనియర్ క్రికెటర్ అయిన అలెస్టర్ కుక్ బోర్డు నిర్వహించిన యోయో టెస్టులో 3 కిలోమీటర్ల దూరాన్ని పరిగెత్తేశాడు.

3 కిలోమీటర్ల దూరాన్ని నిర్ణీత సమయంలో

3 కిలోమీటర్ల దూరాన్ని నిర్ణీత సమయంలో

అంతకుమించి దూరాన్ని పరిగెత్తిన కుక్.. 3కిలోమీటర్ల 80 మీటర్లు పరిగెత్తాడు. ఆ తర్వాత పూర్తిగా అలసిపోయిన కుక్ నేలపై పడున్న వీడియోను ఈసీబీ తన ట్విట్టర్ ద్వారా పోస్టు చేసింది. రెండు శంకు ఆకారాల మధ్యగా పరిగెత్తి 3 కిలోమీటర్ల దూరాన్ని నిర్ణీత సమయంలో చేరుకోవాలి. ఈ క్రమంలో జోయ్ రూట్, జేమ్స్ అండర్సన్, కుక్ ఇప్పటికే టెస్టులో పాసైపోయారు.

 బీసీసీఐ నిర్వహించే యోయో టెస్టులో 16.1, ఈసీబీ 19

బీసీసీఐ నిర్వహించే యోయో టెస్టులో 16.1, ఈసీబీ 19

బీసీసీఐ నిర్వహించే యోయో టెస్టులో ఉత్తీర్ణత మార్కులు 16.1 ఉండగా ఈసీబీ నిర్వహించే యోయో టెస్టులో ప్రతి ఆటగాడు 19పాయింట్లు దాటితేనే ఉత్తీర్ణులైనట్లు నిర్దారిస్తారు. కాగా బీసీసీఐ నిర్దేశించిన పాయింట్లు కూడా చేరుకోకుండా చాలా మంది ఫెయిలై తిరుగుబాట పట్టారు.

అంబటి యోయో టెస్టు ఒకసారి ఫెయిలై

అంబటి యోయో టెస్టు ఒకసారి ఫెయిలై

వారిలో హైదరాబాద్‌కు చెందిన అంబటి రాయుడు ఒకరు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన అంబటి యోయో టెస్టు ఒకసారి ఫెయిలైయ్యాడు. రెండో సారి గైర్హాజరీతో భారత జట్టులో ఆడే అవకాశం కోల్పోయాడు. ఇంగ్లాండ్‌తో మొదలుకానున్న యోయో టెస్టుకు ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆగష్టు 1న బుధవారంతో ఇరు జట్ల మధ్య ఆఖరి సిరీస్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ఎడ్జ్‌బాస్టన్ వేదిక కానుంది.

Story first published: Monday, July 30, 2018, 17:14 [IST]
Other articles published on Jul 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+