కుక్ ఆల్‌టైమ్ అత్యుత్తమ ఆటగాళ్ల జాబితా.. సచిన్‌కు దక్కని చోటు.. కోహ్లీపై ప్రశంసలు!!

లండన్: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఆటగాళ్లు సోషల్ మీడియాలో చాట్ షోలు నిర్వహిస్తూ.. తమ ఫేవరేట్ జట్లను ప్రకటిస్తున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా ఆటగాడు ఆస్టన్ అగర్, దక్షిణాఫ్రికా వెటరన్ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్, శ్రీలంక మాజీ ఆటగాడు తిలకరత్నె దిల్షాన్ ప్రపంచ అత్యుత్తమ క్రికెట్ జట్టును ప్రకటించగా.. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఆల్ టైం ఐపీఎల్ జట్టును ప్రకటించాడు.

కోహ్లీపై కుక్ ప్రశంసలు:
తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఆల్ టైం అత్యుత్తమ ఐదుగురు ఆటగాళ్ల జాబితాను ప్రకటించాడు. ఈ జాబితాలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు కల్పించాడు. ఫార్మాట్‌లతో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్న రన్‌మెషీన్ ప్రపంచ స్థాయి ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని కుక్ పేర్కొన్నాడు. కోహ్లీపై కుక్ ప్రశంసలు కురిపించాడు. అతన్ని వెస్టిండీస్ లెజండరీ బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారాతో పోల్చాడు. 160 టెస్టుల్లో 44.88 సగటుతో కుక్ 12,254 పరుగులు సాధించి ఇంగ్లాండ్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా చరిత్ర సృష్టించాడు.

సచిన్‌కు దక్కని చోటు:
విరాట్ కోహ్లీతో పాటు ఈ జాబితాలో వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వస్ కలిస్, శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు అలిస్టర్ కుక్ చోటు కల్పించాడు. ఈ జాబితాలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు చోటు కల్పించకపోవడం ఆశ్చర్యకరం. అంతర్జాతీయ క్రికెట్‌లో టన్నుల కొద్ది పరుగులు చేసిన మాస్టర్‌ను కుక్ విస్మరించాడు. కుక్ గతంలో ఆల్ టైమ్ ఎలెవన్ జట్టును ప్రకటించగా.. కనీసం ఒక్క భారతీయ క్రీడాకారుడికి కూడా చోటు కల్పించలేదు.

లారా సెంచరీ అద్భుతం:
ఆల్‌టైమ్ అత్యుత్తమ ఐదుగురు ఆటగాళ్ల జాబితాలో లారా, కోహ్లీపై కుక్ ప్రశంసల వర్షం కురిపించాడు. లారా తర్వాత అంతటి డేంజరస్ బ్యాట్స్‌మన్ కోహ్లీనే అని కితాబిచ్చాడు. మేరీలెబోన్ క్రికెట్ క్లబ్‌తో కలిసి వెస్టిండీస్‌లో పర్యటించినప్పుడు లారా ఆధిపత్యాన్ని చూసి ఆశ్చర్యపోయానని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చెప్పాడు. ఎంసీసీకి వ్యతిరేకంగా లారా లంచ్ సమయానికే సెంచరీ చేసిన ఆ పర్యటనను గుర్తుచేసుకున్నాడు. ది సండే టైమ్స్‌తో కుక్ మాట్లాడుతూ... సైమన్ జోన్స్, మాథ్యూ హోగార్డ్, మిన్ పటేల్ బౌలింగ్‌లో లారా సెంచరీ చేసిన విధానం అద్భుతం అని పేర్కొన్నాడు.

కుక్ ఆల్‌టైమ్ అత్యుత్తమ ఆటగాళ్ల జాబితా:
బ్రియాన్ లారా, జాక్వస్ కలిస్, కుమార సంగక్కర, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications