Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐదో డబుల్ సెంచరీ: రికార్డుల మోత, దిగ్గజాల సరసన అలెస్టర్ కుక్

Alastair Cook hits double century as England build lead over Australia

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లాండ్ ఓపెనర్ అలెస్టర్ కుక్ డబుల్ సెంచరీతో మెరిశాడు. టెస్టుల్లో అలెస్టర్ కుక్‌కు ఇది ఐదో డబుల్ సెంచరీ. అలెస్టర్ కుక్ డబుల్ సెంచరీతో మెరవడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది.

తాజా డబుల్ సెంచరీతో టెస్టుల్లో ఐదు డబుల్‌ సెంచరీలు సాధించి రాహుల్ ద్రవిడ్, గ్రేమ్‌ స్మిత్‌ల సరసన అలెస్టర్ కుక్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఫోర్‌తో కుక్ డబుల్ సెంచరీ సాధించడం విశేషం. 361 బంతుల్లో 23 ఫోర్లతో కుక్‌ డబుల్‌ సెంచరీ మైలురాయిని అందుకున్నాడు.

ఇంగ్లాండ్ Vs ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్టు స్కోరు కార్డు

ఓవర్ నైట్ స్కోరు 104 పరుగులతో మూడో రోజైన గురువారం ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అలెస్టర్ కుక్‌కు 153 పరుగుల వద్ద ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ లైఫ్ ఇచ్చాడు. ఈ లైఫ్‌ని సద్వినియోగం చేసుకున్న కుక్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కుక్ మాత్రం నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించాడు.

ఈ డబుల్ సెంచరీతో అలెస్టర్ కుక్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 150కిపైగా పరుగులు సాధించిన ఇంగ్లాండ్ ఆటగాడిగా కుక్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక సార్లు ఈ మైలురాయిని అందుకున్న జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్రేమ్‌ స్మిత్‌ సరసన కుక్‌ నిలిచాడు.

ఈ టెస్టులో అలెస్టర్ కుక్ మొత్తం 400 బంతులను ఎదుర్కొన్నాడు. తాజా డబుల్ సెంచరీతో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అలెస్టర్ కుక్ (11868) వెస్టిండిస్‌కు చెందిన చందర్ పాల్‌ (11867)ను అధిగమించి ఏడో స్ధానంలో నిలిచాడు. అంతేకాదు మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పర్యాటక జట్టుకు చెందిన ఆటగాళ్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అలెస్టర్ కుక్ నిలిచాడు.

ఇదిలా ఉంటే, టెస్టుల్లో అత్యధిక టెస్టు డబుల్‌ సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో ఆస్ట్రేలియాకు చెందిన బ్రాడ్‌మన్‌ (12సార్లు), తొలి స్థానంలో ఉండగా, శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర (11సార్లు) రెండో స్థానంలో, వెస్టిండిస్‌కు చెందిన బ్రియాన్‌ లారా (9) మూడో స్థానంలో, శ్రీలంకకు చెందిన మహిళా జయవర్థనే (7) నాలుగో స్ధానంలో ఉన్నారు.

మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 491 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కుక్ (244 నాటౌట్), జేమ్స్ ఆండర్సన్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై ఇంగ్లాండ్ 164 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Story first published: Thursday, December 28, 2017, 13:14 [IST]
Other articles published on Dec 28, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+