
1993 తర్వాత ఇదే మొట్టమొదటిసారి
‘ఒక క్యాలెండర్ సంవత్సరంలో 8 టెస్టులు ఓడిపోవడం 1993 తర్వాత ఇదే మొట్టమొదటిసారి. టీమిండియా చేతిలో సిరీస్ ఓటమి, బంగ్లాదేశ్ చేతిలో తొలిసారి టెస్టు పరాజయం, సొంతగడ్డపై పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ 2-2తో డ్రా అవడం ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ చరిత్రలో చీకటి అధ్యాయాలే. టెస్టుల్లో కుక్ సారథ్యంలో ఇంగ్లాండ్ 22 సార్లు ఓడింది. కెప్టెన్‌గా అత్యధిక పరాజయాలు మూటగట్టుకున్నది కూడా కుకే. అతని సారథ్యంలో ఇంగ్లాండ్ 59 టెస్టుల్లో 24 మ్యాచ్‌ల్లో గెలుపొందగా 22 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. విఫలమైన కెప్టెన్‌గా కుక్ గతంలో ఉన్న రికార్డును కూడా బద్దలుకొట్టాడు' అంటూ టెలిగ్రాఫ్ ఓ కథనం రాసింది.

స్లో పిచ్‌లపై ఇంగ్లాండ్ నిలకడగా ఓడిపోతోంది
ఇక గార్డియన్ పత్రిక విషయానికి వస్తే ‘గత రెండేళ్ళుగా ఫ్లాట్, స్లో పిచ్‌లపై ఇంగ్లాండ్ నిలకడగా ఓడిపోతోంది. ఆ వికెట్లపై నాణ్యమైన స్పిన్నర్లు ఎదురైతే ఇంగ్లాండ్ కథ ముగిసినట్లే. భవిష్యత్తు గురించి జట్టు డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్‌కు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. జో రూట్, స్టోక్స్ లాంటి యువ ఆటగాళ్ళకు బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఆసన్నమైంది' అంటూ గార్డియన్ పేర్కొంది.

అనాలోచిత నిర్ణయాలూ తీసుకోను
టెస్టు సిరిస్ ఓటమి నేపథ్యంలో కెప్టెన్సీపై ఎలాంటి అనాలోచిత నిర్ణయాలూ తీసుకోనని అలెస్టర్ కుక్ అన్నాడు. అయితే ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్‌గా తాను కొనసాగేది లేనిది త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించాడు. 1999 తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలను భారత్ కైవసం చేసుకుంది. టెస్టుల్లో భారత్‌కు ఇది వరుసగా 18 విజయం కావడం విశేషం.

స్వదేశం తిరిగి వెళ్లి దీనిపై ఆలోచిస్తా
‘నేను స్వదేశం తిరిగి వెళ్లి దీనిపై కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ముందు నేను ఇంటికి తిరిగి వెళ్లి క్రిస్మస్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తాను. ఆ తర్వాత జనవరిలో తిరిగి వచ్చి ఇంగ్లండ్ క్రికెట్‌కు ఏది మంచిదో స్ట్రాస్‌తో కలిసి ఆలోచిస్తాను' అని మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కుక్ చెప్పారు.

తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం
ఇంగ్లాండ్ జట్టును ముందుకు తీసుకెళ్లడానికి నేను సరైనవాడినో కాదో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ఎందుకంటే శక్తి తక్కువగా ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని కుక్ చెప్పాడు. దాదాపు 7 నెలల పాటు టెస్టు మ్యాచ్ ఏదీ లేదని, అందువల్ల ఇప్పుడే, ఇక్కడికిక్కడే నిర్ణయం తీసుకోవడం తెలివితక్కువ అవుతుందని కూడా అలెస్టర్ కుక్ చెప్పాడు.


Click it and Unblock the Notifications











