Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కారణం: విశాఖ టెస్టుకు మాజీ ప్లేయర్ వేణుకు దక్కని ఆహ్వానం?

విశాఖపట్నం: విశాఖపట్నంలో తొలిసారి టెస్టు మ్యాచ్ నిర్వహించిన ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) టీమిండియా మాజీ ఆటగాడు వేణు గోపాలరావును మాత్రం విస్మరించింది. ఆంధ్రప్రదేశ్ తరుపున భారత జట్టుకు ఆడిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో వేణు గోపాలరావు ఒకడు.

Venu gopala rao not received invitation for first test inaugurated by aca at Vizag

భారత్ Vs ఇంగ్లాండ్ టెస్టు సిరిస్ ఫోటోలు

ప్రస్తుతం భారత జట్టు ఛీప్ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు వేణు గోపాలరావు కూడా భారత జట్టుకు అడిన ఘనతను సాధించాడు. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో తొలిసారి టెస్టు మ్యాచ్ నిర్వహించిన ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) పలువురు మాజీ క్రికెటర్లను ఘనంగా సన్మానించింది.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నంలో గురువారం నుంచి ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదగా ఏసీఏ ప్రారంభింపజేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు గవాస్కర్, కుంబ్లే, మంజ్రేకర్, శివరామకృష్ణన్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్‌లను పిలిచి మెమెంటోలతో సత్కరించారు.

అయితే ఆంధ్రప్రదేశ్ తరుపు నుంచి భారత జట్టుకు ఆడిన వేణు గోపాలరావుని టెస్టు మ్యాచ్‌కి ఆహ్వానించలేదు. నిజానికి ఏ క్రికెట్ సంఘమైనా ఇలాంటి సమయంలో తమ ఆటగాళ్లను సత్కరించడం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తోంది. అయితే వేణు గోపాలరావుని కూడా పిలిచి ఓ మెమెంటో ఇచ్చి ఉంటే బాగుండేదని పలువురు క్రీడా విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

వేణుగోపాలరావు విశాఖపట్నంలోనే ఉన్న ఎటువంటి ఆహ్వానం పంపలేదుకనీసం ఒక ఫోన్, మెయిల్ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఓ మాజీ భారత క్రికెటర్‌కు ఇలాంటి పరిస్థితి రాకూడదని అతని సహచరులే ఆవేదనను వ్యక్తం చేశారు.

మాజీలకు సన్మానం: టెస్టు మ్యాచ్‌ని వీక్షించిన చంద్రబాబు

అయితే ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ)లోని కొందరు వ్యక్తులకు వేణుగోపాలరావు అంటే వ్యక్తిగతంగా ఇష్టం లేనందు వల్ల ఇలా చేశారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని వేణుగోపాలరావు సహచరులు సైతం స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం విశాఖ టెస్టు మ్యాచ్‌పై కూడా పడింది.

మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు పోటెత్తక పోవడంతో తొలిరోజు క్రీడాభిమానును ఉచితంగానే అనుమతిస్తున్నారు. మరోవైపు విశాఖ చుట్టుపక్కల స్కూళ్లలోని 10,000 మందికి బాలురు, బాలికలకు ఉచితంగా ఈ మ్యాచ్‌ని వీక్షించే వెసులుబాటుని ఏసీఏ కల్పించింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+