Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: కోహ్లీ వల్ల అక్షర్ రనౌట్ అయ్యాడా.. అస్సలు ఏం జరిగింది..

Akshar Patel was run out in the ongoing match against Pakistan

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా సూపర్-12 మ్యాచ్ ఇండియా తడబడుతోంది. 7 ఓవర్లకే ఇండియా 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తక్కువ పరుగులకే ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ వేగంగా ఆడే క్రమంలో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ దశలో టీమిండియా ఓ ప్రయోగం చేసింది. ఐదో వికెట్ గా స్పిన్నర్ అక్షర్ పటేల్ ను పంపింది.

షాబాద్ ఖాన్

షాబాద్ ఖాన్

కానీ టీమిండియా ప్రయోగం విఫలమైంది.ఏడో ఓవర్లో అక్షర్ పటేల్ ఔటయ్యాడు. 6వ ఓవర్ షాబాద్ ఖాన్ వేశాడు. అక్షర్ పటేల్ బంతిని కోహ్లీ రన్ రమ్మన్నాడు. దీంతో అక్షర్ ముందుకు వచ్చాడు. కానీ కోహ్లీ వెనక్కు వెళ్లాలని చెప్పాడు. ఈ క్రమంలో బాబర్ అజాం బంతిని కీపర్ రిజ్వాన్ కు వేశాడు. రిజ్వాన్ వెంటనే వికెట్లను కొట్టడంతో అక్షర్ పటేల్ రనౌట్ అయ్యాడు.

ట్రోల్స్

కోహ్లీ వల్ల అక్షర్ రనౌట్ అయినట్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన పాకిస్థాన్ బ్యాటింగ్ కు దిగింది. 20 ఓవర్లలో8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లను హర్ష్ దీప్ త్వరగానే పెవిలియన్ చేర్చాడు. కానీ ఆ తర్వాత వచ్చిన షాన్ మసూద్, ఇఫ్తికార్ జట్టును ఆదుకున్నారు. షాన్ మసూద్ 42 బంతుల్లో 5 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ఇఫ్తికా అహ్మద్ 34 బంతుల్లో 4 సిక్స్ లు, 2 ఫోర్లతో 51 పరుగులు చేశాడు.

హీన్ షా అఫ్రిదీ

చివర్లో షహీన్ షా అఫ్రిదీ 8 బంతుల్లో 16 పరుగులు చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ కు తన మొదటి ఓవర్ లోనే హర్ష్ దీప్ షాకిచ్చాడు. పాక్ కె ప్టెన్ బాబర్ అజాం ను ఎల్బీడబ్యూగా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ హర్ష్ దీప్ బౌలింగ్ లో భువనేశ్వర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీ చేసి ఊపు మీద ఉన్న ఇఫ్తికార అహ్మద్ ను మహ్మద్ షమీ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు.

19 ఓవర్ లో

ఆ తర్వాత షాదాబ్ ఖాన్ ను హార్దిక్ పాండ్యా 5 పరుగులకే ఔట్ చేశాడు. హార్దిక్ పాండ్యా హైదర్ అలీని కూడా 2 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. ఫామ్ లో ఉన్న మహ్మద్ నవాజ్ ను హార్ధిక్ పాండ్యా 9 పరుగులకే ఔట్ చేశాడు. అసిఫ్ అలీని హర్ష్ దీప్ వెనక్కు పంపగా.. షహీన్ షా అఫ్రిదీని భువనేశ్వర్ పెవిలియన్ చేర్చాడు. కాగా 19 ఓవర్ లో హర్ష్ దీప్ భారీగా పరుగులిచ్చాడు.

పాండ్యా, హర్ష్ దీప్

భారత్ బౌలర్లలో హర్ష్ దీప్ 4 ఓవర్లు వేసి 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టగా.. మహ్మద్ షమీ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఒక ఓవర్ వేసిన అక్షర్ పటేల్ 21 పరుగులించాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడు ఓవర్లు వేసి 23 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

Story first published: Sunday, October 23, 2022, 16:45 [IST]
Other articles published on Oct 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+