Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్‌, ద్రవిడ్‌లకు అక్తర్ క్షమాపణ చెప్పాల్సిందే: శుక్లా

Shoaib Akhtar
పాకీస్దానీ ఫాస్ట్ బౌలర్ 'రావల్పిండి ఎక్స్ ప్రెస్' బిరుదాంకితుడు షోయబ్‌ అక్తర్‌ తన స్వీయచరిత్ర 'కాంట్రవర్శియల్‌ యువర్స్‌'లో క్రికెట్ దేవుడు సచిన్‌, ద్రావిడ్‌లను విమర్శించినందుకు తక్షణమే వారికి క్షమాపణ చెప్పాలని ఐపిఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా డిమాండ్‌ చేయడం జరిగింది. తన స్వీయచరిత్రలో సచిన్‌, ద్రావిడ్‌లు ఇరువురు మ్యాచ్‌ విన్నర్లు కాదని, ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వలేరని అక్తర్‌ తన పుస్తకంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై సచిన్‌ని స్పందించమనగా దానికి సచిన్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో సచిన్‌ అక్తర్‌ నుంచి ఎలాంటి సర్టిఫికెట్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం బ్రాడ్‌మెన్ నుండే సచిన్‌ ప్రశంసలు పొందాడని, అక్తర్‌ ముందు నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని శుక్లా పేర్కొన్నాడు.' అంతే కాకుండా ప్రపంచంలో క్రికెట్‌లో ఉన్న అన్నిరకాల అత్యున్నత శిఖరాలను సచిన్ అందుకోవడం జరిగిందన్నారు.

గ్రేట్ వాల్ అయిన ద్రావిడ్‌ను ప్రభావితం చేశాడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు సచిన్‌ ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడు. అవి జట్టు పట్ల అతడి అంకితభావాన్ని చూచిస్తాయని, అక్తర్‌ రాతలు అభ్యంతరకరమైనవి' అని శుక్లా అన్నాడు. అంతకు ముందు అక్తర్ చేసిన వ్యాఖ్యలను ఫాస్ట్ బౌలర్ వసీం అక్రం కూడా ఖండించిన సంగతి తెలిసిందే.

దీనిపై స్పందించిన వసీం అక్రమ్‌ తనదైన శైలిలో స్పందించాడు. ప్రపంచ ఫాస్టు బౌలర్స్‌లలో ఒకడైన షోయబ్‌ అక్తర్‌ తన ఆటో బయోగ్రఫీలో సచిన్‌ వంటి స్టార్‌ ఆటగాడిని కించపరచడం మంచి పద్ధతి కాదని పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ అన్నాడు. రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదురులేని బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న సచిన్‌పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నాడు. ఎటువంటి బౌలర్‌నైనా దీటుగా ఎదుర్కొనే సత్తా ఒక్క సచిన్‌కే ఉందని, దీనిలో రెండో అభిప్రాయానికి తావులేదన్నాడు. తాను ఆడిన తొలి సిరీస్‌లోనే పాక్‌ బౌలర్లను హడలెత్తించిన ఘనత సచిన్‌కు దక్కుతుందన్నాడు. 1989 పాక్‌ సిరీస్‌లో సచిన్‌ తనతోపాటు వకార్‌ యూనిస్‌ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొని అర్ధ సెంచరీని సాధించిన విషయాన్ని అక్రమ్‌ గుర్తు చేశాడు. అక్తర్‌ పబ్లిసిటీ కోసమే తన బయోగ్రఫీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని అక్రమ్‌ అభిప్రాయ పడ్డాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+