అక్తర్ మాట్లాడుతూ
తాజాగా పీటీవీ స్పోర్ట్స్ 'గేమ్ ఆన్ హాయ్' అనే కార్యక్రమంలో పాల్గొన్న షోయబ్ అక్తర్ మాట్లాడుతూ "నా కెరీర్లో ప్రాంతీయతపై మాట్లాడటం ప్రారంభించినప్పుడు జట్టులోని ఇద్దరు ముగ్గురి ఆటగాళ్లతో నేను విభేదించేవాణ్ని. కరాచి నుంచి ఎవరు ఉన్నారు.. పంజాబ్ లేదా పెషావర్ నుంచి ఎవరైనా ఉన్నారా? లాంటి మాటలు తీవ్రమైన కోపం తెప్పించేవి" అని అన్నాడు.
హిందువు అయితే తప్పేంటి?
"జట్టు కోసం మంచి ప్రదర్శన చేస్తున్న ఆటగాడు హిందువు అయితే తప్పేంటి? కనేరియా మద్దతు లేకుంటే ఇంగ్లాండ్‌పై మేం టెస్టులు గెలిచేవాళ్లం కాదు. కానీ, ఆ ఘనత అతనికి దక్కకుండా చేశారు" అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. అక్తర్ వ్యాఖ్యలను కనేరియా సమర్థించడం విశేషం.
అక్తర్ వ్యాఖ్యలను సమర్ధించిన కనేరియా
"షోయబ్ ఓ లెజెండ్. అతని మాటలు కూడా అతని బౌలింగ్ లాగా మొద్దుబారినవి. నేను ఆడుతున్న రోజుల్లో ఈ విషయం గురించి మాట్లాడే ధైర్యం లేకపోయింది. ఇప్పుడు అక్తర్ చెబుతున్న మాటలు నిజం. అతనితో పాటు ఇంజమాముల్ హక్, మహమ్మద్ యూసుఫ్, యూనిస్ ఖాన్ నాకు మద్దతుగా నిలిచేవాళ్లు" అని కనేరియా తెలిపాడు.
స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన కనేరియా
39 ఏళ్ల కనేరియా 2009లో డర్హామ్‌పై ఎసెక్స్ తరఫున ఆడుతున్నప్పుడు మెర్విన్ వెస్ట్‌ఫీల్డ్‌తో కలిసి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. వెస్ట్‌ఫీల్డ్ తనను ఓ వన్డే గేమ్‌లో 12 పరుగులు ఇవ్వాలని ఒప్పించాడని కనేరియా అంగీకరించాడు. దీంతో వెస్ట్ఫీల్డ్కు నాలుగు నెలల జైలు శిక్ష విధించడంతోపాటు ఈసీబీ అతడిని ఐదేళ్లపాటు సస్పెండ్ చేసింది. ఆరేళ్ల తిరస్కరణ తర్వాత కనేరియా 2018లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించాడు.