సర్ జడేజా 2.0: నాడు అభిమాని.. నేడు వారసుడు!
మనసులో ఏదైనా బలంగా కోరుకుంటే అది నిజమవుతుందనే దానికి సీఎస్కే స్టార్ స్పిన్నర్ అఖీల్ హుస్సేన్ ఓ సజీవ ఉదాహరణగా నిలిచాడు. సరిగ్గా 13 ఏళ్ల క్రితం.. అంటే 2013లో వెస్టిండీస్‌కు చెందిన ఈ యువ క్రికెటర్ రవీంద్ర జడేజా ఆటతీరును చూసి ముగ్ధుడై.. "ఒకరోజు నేను కూడా ఆయనలాంటి ఆటగాడిని కావాలి" అని అఖీల్ హుస్సేన్ ట్వీట్ చేశాడు. కాలం వెనక్కి తిరిగి చూస్తే.. 2026 ఐపీఎల్ వేదికగా అఖీల్ హుస్సేన్ తను కన్న కలను నిజం చేసుకోవడమే కాకుండా తన ఆరాధ్య దైవం వదిలిన వారసత్వాన్ని అందిపుచ్చుకోవడం విశేషం.
అచ్చం జడేజాలాగే..
ఐపీఎల్ 2026 వేలంలో సీఎస్కే అఖీల్ హుస్సేన్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేయడం ఓ వ్యూహాత్మక నిర్ణయం. రవీంద్ర జడేదా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వెళ్లడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసే బాధ్యత అఖీల్ హుస్సేన్‌పై పడింది. అయితే అఖీల్ కేవలం జడేజా స్థానాన్ని మాత్రమే కాదు.. జడేజా స్టైల్‌ను కూడా మైదానంలో చూపిస్తున్నాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా.. పవర్ ప్లేలో రన్స్‌ను కట్టడి చేస్తూ వికెట్లు తీయడంలో అఖీల్ హుస్సేన్ ఇప్పుడు 'సర్ జడేజా'ను గుర్తు చేస్తున్నాడు.

4 కీలక వికెట్లు పడగొట్టిన అఖీల్ హుస్సేన్
ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన 'ఎల్ క్లాసికో' పోరులో అఖీల్ హుస్సేన్ సృష్టించిన విధ్వంసం మామూలుది కాదు. వాంఖడే స్టేడియంలో 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి ముంబై బ్యాటింగ్ వెన్నెముక విరిచాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, నమన్ ధీర్ వంటి దిగ్గజ బ్యాటర్లను తన స్పిన్ మాయాజాలంతో పెవిలియన్ చేర్చాడు. వికెట్ తీసిన తర్వాత అతను చూపే ఆ ప్రశాంతమైన, భయం లేని 'కోల్డ్' సెలబ్రేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
నేటి ఆధునిక టీ20 క్రికెట్‌లో 200 పరుగుల స్కోరు కూడా సురక్షితం కాదని భావిస్తున్న తరుణంలో అఖీల్ హుస్సేన్ పాత తరం బౌలర్లలా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ టోర్నీలో అఖీల్ హుస్సేన్ ఎకానమీ రేట్ 6.3 గా ఉండటం ఓ అద్భుతం. బంతిని గాలిలో డ్రిఫ్ట్ చేస్తూ, టర్న్ చేయడంలో అఖీల్ హుస్సేన్ చూపిస్తున్న వైవిధ్యం మిగతా జట్లకు పెద్ద సవాలుగా మారింది. జడేజా వారసత్వం సరైన చేతుల్లోనే ఉందని సీఎస్కే అభిమానులు ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications