World Record: భారత క్రికెట్ చరిత్రలో ఓ కొత్త రికార్డు నమోదైంది. మేఘాలయకు చెందిన ఆకాశ్ కుమార్ చౌదరి రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌పై వరుసగా 8 సిక్సర్లు బాదాడు. కేవలం 11 బంతుల్లోనే తన అర్థ సెంచరీని పూర్తి చేసి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత దిగ్గజం యువరాజ్ సింగ్‌ను కూడా ఈ రికార్డు విషయంలో అధిగమించాడు.
ఆకాశ్ కుమార్ సంచలనం: 11 బంతుల్లో ప్రపంచ రికార్డు
గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 25 ఏళ్ల రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ఆకాశ్.. కేవలం 11 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లాండ్‌కు చెందిన వేన్ వైట్ పేరిట ఉండేది, ఆయన 2012లో 12 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించారు.

వరుసగా 8 సిక్సర్లు.. ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు
ఆకాశ్ ఇన్నింగ్స్‌లో అత్యంత ముఖ్యమైన విషయం వరుసగా సిక్సర్లు కొట్టడం. ఆకాశ్ ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగేసరికి మేఘాలయ జట్టు 6 వికెట్లకు 576 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆకాశ్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. అతను కేవలం కొద్ది ఓవర్లలోనే అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇందులో భాగంగా బౌలర్ లీమర్ డాబీ వేసిన ఒకే ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు సహా మొత్తం వరుసగా 8 సిక్సర్లు బాదాడు. ఇది టీ20 మ్యాచ్‌లలో కూడా అరుదైన దృశ్యం. ఆకాశ్ 14 బంతుల్లో 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ వెంటనే మేఘాలయ 6 వికెట్ల నష్టానికి 628 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈ రికార్డు రంజీ ట్రోఫీకి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం ఫస్ట్-క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైనది.
యువరాజ్ సింగ్ రికార్డుతో పోలిక:
టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్‌లో కేవలం 12 బంతుల్లో అర్ధసెంచరీ చేసి టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆకాశ్ కుమార్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో దానికంటే ఒక బంతి ముందే (11 బంతుల్లో) హాఫ్ సెంచరీ చేసి ఈ ఫార్మాట్‌లో యువరాజ్‌ను కూడా అధిగమించాడు. బ్యాటింగ్‌తో పాటు ఆకాశ్ కుమార్ తర్వాత కొత్త బంతితో బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా తీయడం ఈ రోజును మరింత గుర్తుండిపోయేలా చేసింది.