కారు కొన్నాడు..అడ్డంగా బుక్కయ్యాడు ..చిక్కుల్లో టీమిండియా స్టార్
టీమిండియా యువ సంచలనం ఆకాష్ దీప్ ఇటీవల ఒక ఊహించని వివాదంలో చిక్కుకున్నాడు. దీనికి కారణం అతను కొనుగోలు చేసిన లగ్జరీ కారు. ఆగస్టు 7న కొనుగోలు చేసిన తన కొత్త టయోటా ఫార్చ్యూనర్కు రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్ లేకపోవడంతో రవాణా శాఖ అధికారులు అతనికి నోటీసు జారీ చేశారు.
నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపై వాహనాన్ని నడపకూడదు. ఆకాష్ దీప్ కారు రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు దానిని రోడ్డుపైకి తీసుకురావద్దని అధికారులు హెచ్చరించారు. ఈ నిబంధనను అతిక్రమిస్తే కారును సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా కారును డెలివరీ చేసినందుకు, కారును అమ్మిన షోరూమ్‌కు కూడా భారీ జరిమానా విధించి, డీలర్‌షిప్‌ను ఒక నెల పాటు సస్పెండ్ చేశారు.

మైదానంలో దూకుడు, రికార్డులతో ఆకట్టుకుంటున్న ఆకాష్ దీప్
మైదానంలో మాత్రం ఆకాష్ దీప్ తన అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఐదో టెస్ట్‌లో కీలకమైన 66 పరుగులు చేసి, టీమిండియా విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇప్పటివరకు అతను ఆడిన 10 టెస్టుల్లో 28 వికెట్లు తీశాడు. దేశీయ క్రికెట్‌లో కూడా అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. 41 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 141 వికెట్లు, 28 లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 42 వికెట్లు సాధించాడు. ఐపీఎల్‌లో కూడా తన ప్రతిభను ప్రదర్శించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications