Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: పాక్‍ జట్టులో షాహీన్ షా కంటే ప్రమాదకరమైన బౌలర్ ఉన్నాడు.. ఎవరంటే..

Akash Chopra says Haris Raouf is a dangerous bowler for India in T20 World Cup 2022

టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఈనెల 23 భారత్ దాయాది దేశమైన పాకిస్థాన్ తో తలపడనుంది. భారత్, పాక్ క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ కు ముందు ఇరు దేశాల మాజీ క్రికెటర్ల పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా భారత్, పాక్ మ్యాచ్ పై ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశాడు. బుధవారం పాకిస్థాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ వార్మప్ మ్యాచ్ సందర్భంగా చోప్రా ట్వీట్ చేశాడు. " షాహీన్ షా అఫ్రిది తన అత్యుత్తమ స్థాయికి చేరువవుతున్నాడు" అని ట్వీట్ చేశాడు.

హరీస్ రవూఫ్
ఆ తర్వాత మరో ట్వీట్ చేశాడు " ఆదివారం నాడు జాగ్రత్తగా ఉండాల్సిన బౌలర్ షాహీన్ కాదు. అది హరీస్ రవూఫ్. అఫ్రిది తన అత్యుత్తమ స్థాయికి చేరువవుతున్నాడు కానీ ఇంకా అక్కడ లేడు.. వచ్చే అవకాశం లేదు.రౌఫ్ కఠినమైన ఓవర్లు బౌల్ చేస్తాడు. వైవిధ్యం చూపే అవకాశం ఉంది" అని అన్నాడు.బుధవారం గబ్బా వేదికగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌లో షాహీన్ పాకిస్థాన్ జట్టులోకి తిరిగి వచ్చాడు.

షాహీన్
అతను 29 పరుగులకు 2 వికెట్లు తీశాడు, ఆఫ్ఘన్ ఓపెనర్లిద్దరినీ తక్కువ స్కోర్లకే ఔట్ చేశాడు. చోప్రా ఈ మ్యాచ్ మంచి షాహీన్ మంచి ప్రదర్శన చేసినప్పటికీ అతను ఆదివారం భారత్ కు అతిపెద్ద ముప్పు కాదన్నాడు. అయితే, టీ20 ప్రపంచకప్‌లో హరీస్ రవూఫ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారనేది కూడా నిజం. గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో షాహీన్ భారత్ పై మూడు వికెట్లు తీశాడు.

Story first published: Wednesday, October 19, 2022, 18:18 [IST]
Other articles published on Oct 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+