కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయానికి కెప్టెన్ రిషభ్ పంత్, మెంటార్ సౌరవ్ గంగూలీ కారణమని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శించాడు. పంత్ నిర్లక్ష్యపు బ్యాటింగ్, దాదా పేలవ వ్యూహాలు ఢిల్లీ జట్టును ఓటమిపాలయ్యేలా చేశాయని అభిప్రాయపడ్డాడు. ఈడెనె గార్డెన్స్ వేదికగా సోమవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మది వికెట్లకు 153 పరుగులు చేసింది. కుల్‌దీప్ యాదవ్ (35; 26 బంతుల్లో, 5x4, 1x6), రిషభ్ పంత్ (27; 20 బంతుల్లో, 2x4, 1x6) టాప్ స్కోరర్లు. వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లుతో (3/16)తో సత్తాచాటాడు. హర్షిత్ రాణా (2/28), వైభవ్ అరోరా (2/29) చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనకు వచ్చిన కేకేఆర్ 16.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించారు. ఫిల్ సాల్ట్ (68; 33 బంతుల్లో, 7x4, 5x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ (33*; 23 బంతుల్లో, 3x4, 1x6), వెంకటేశ్ అయ్యర్ (26*; 23 బంతుల్లో, 2x4, 1x6) జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మ్యాచ్ గురించి ఆకాశ్ చోప్రా విశ్లేషిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
''68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయారు. ఈ స్థితిలో కెప్టెన్ పంత్, అక్షర్ పటేల్ జట్టును ఆదుకుంటారని ఆశిస్తారు. కానీ పంత్ ఆట ఆశ్చర్చానికి గురిచేసింది. అతను అలా ఆడాల్సి ఉండకూడదు. ప్రతి బంతిని భిన్నంగా ఆడాలని ప్రయత్నించాడు. ఒకే షాట్‌ను చాలా సార్లు ట్రై చేశాడు. క్యాచ్ డ్రాప్‌తో ఔట్ నుంచి తప్పించుకున్నాడు. అంతేగాక ఎన్నో సార్లు మిస్ చేశాడు''
''అయినప్పటికీ.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్నట్లుగా పంత్ కొనసాగించాడు. చివరికి ఔట్ అయ్యాడు. పంత్ ఆట ఆశ్చర్యాన్ని కలిగింది. అతను ఇంతకంటే మెరుగ్గా ఆడగలడు. ఇక టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకోవడం ఏంటి? విమర్శించాలని కాదు, కానీ ఆ నిర్ణమేంటి? మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ బ్యాటింగ్ సులభతరం అవుతుంది. కానీ ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. గంగూలీ పిచ్‌ను సరిగా అర్థం చేసుకోలేదా? ఈడెన్ గార్డెన్స్ వికెట్‌ను అతని కంటే ఎవరు బాగా అర్థం చేసుకోగలరు?'' అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.