ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతా పెళ్లి వేడుకలో క్రికెటర్ల సందడి (ఫోటోలు)

హైదరాబాద్: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా కూతురు శ్లోకా మెహతా వివాహం శనివారం రాత్రి అంగరంగా వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడారంగ దిగ్గజాలతో పాటు విదేశీ ప్రముఖులు సైతం హాజరయ్యారు.
ముంబైలోని ట్రిడెంట్ హోటల్‌లో జరిగిన ఈ వివాహానికి భారత క్రికెటర్లు హాజరై సందడి చేశారు. పెళ్లికి హాజరైన వారిలో సచిన్ టెండూల్కర్ దంపతులు, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జహీర్ ఖాన్, పార్థీవ్ పటేల్, శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్దనే తదితరులు ఉన్నారు. పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక అలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో
బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో వివాహ వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. అతిథుల కోసం రాత్రి గ్రాండ్ టీ పార్టీ ఏర్పాటు చేశారు. పెళ్లి మంటపాన్ని అందమైన పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వివాహ వేడుక జరుగుతున్న హాల్‌ను అద్భుతంగా అలంకరించారు.

ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి పూల మాలవేసి నివాళి
తొలుత ముఖేశ్, నీతా అంబానీ దంపతులతో పాటు, వరుడు ఆకాశ్ అంబానీ.. ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. శనివారం సాయంత్రం జరిగిన ఫంక్షన్‌లో ముఖేశ్ భార్య నీతాతో పాటు బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లాలు సందడి చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా సచిన్ దంపతులు
బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, చెర్రీ బ్లెయిర్ దంపతులు ఈ వివాహ వేడుకకు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు ఐక్యరాజ్యసమతి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ దంపతులు, గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ దంపతులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
బాలీవుడ్ నుంచి పలువురు హాజరు
వీరితో పాటు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాతో పాటు రజనీకాంత్ బాలీవుడ్ నటులు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు, ప్రియాంక్ చోప్రా, ఐశ్వర్య రాయ్, అభిషేక్, అమితాబ్, అమీర్ ఖాన్ , రతన్ టాటా, సచిన్, టైగర్ ష్రాప్, దిశా పటాని, కియరా అద్వానీ, జాన్వీ కపూర్, విద్యాబాలన్, అలియా భట్, డిజైనర్ మనీష్ మల్హొత్రా తదితరులు పాల్గొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications