వెస్టిండీస్‌తో సిరీసుకు భారత జట్టు రెడీ అవుతోంది. అయితే ఈ టూర్‌కు ఎంపిక చేసిన జట్టుపై తెగ చర్చ జరుగుతోంది. టెస్టు టీంను ప్రకటించినప్పుడు సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం ఇవ్వలేదని తెగ గొడవ జరిగింది. అలాగే టీ20 టీంను ప్రకటించినప్పుడు రింకూ సింగ్, జితేశ్ శర్మ వంటి వారిని సెలెక్ట్ చేయలేదని విమర్శలు వచ్చాయి.
అయితే కొత్త కుర్రాళ్లు అందర్నీ ఒకే సిరీస్‌లో ఆడించకూడదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భావించినట్లు సమాచారం. అందుకే ఈ సిరీస్‌లో మిస్ అయిన రింకూ సింగ్, జితేశ్ శర్మ తదితరులకు ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో అవకాశం ఇస్తారని వార్తలు వచ్చాయి. ఇలా ఒక్కో సిరీస్‌లో ఇద్దరు, ముగ్గురు కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని, తద్వారా నిలకడగా రాణించే వారిని ఎంపిక చేయాలని అగార్కర్ ప్లాన్ వేశాడట.

ఈ క్రమంలోనే ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో రింకూ సింగ్, జితేశ్ శర్మ వంటి వారితో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీష్ రాణాను కూడా ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారట. గతంలో కూడా రాణాకు టీమిండియా తరఫున ఆడే అవకాశం వచ్చింది. కానీ ఆ అవకాశాలను అతను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున కేవలం మూడు మ్యాచులే ఆడాడతను.
అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో రాణా ఫర్వాలేదనిపించాడు. కేకేఆర్ విజయాల్లో రాణా, రింకూ సింగ్ కీలక పాత్ర పోషించారు. మిడిలార్డర్‌లో రాణా చక్కని ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతనికి మరో అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారట. అతను కనుక ఐర్లాండ్ సిరీస్‌లో రాణిస్తే.. చైనా వేదికగా జరిగే ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే టీంలో కూడా అతన్ని ఎంపిక చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం.