ధోని టీ20 ఫామ్‌పై వ్యాఖ్యలు: అగార్కర్‌ను ఓ ఆట ఆడుకున్న నెటిజన్లు
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించినా.. రాణించకున్నా కొంతమంది ఆటగాళ్లకు మాజీల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. అలాంటి క్రికెటర్లలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒకడు. టీ20ల నుంచి ధోని తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌లో రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారీ లక్ష్యం ముందున్నా.. ధోని నెమ్మదిగా ఆడుతూ మ్యాచ్ ఓటమికి కారణమయ్యాడని వీరు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే ధోనికి గవాస్కర్, రవిశాస్త్రి, సెహ్వాగ్‌లతోపాటు.. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మద్దతు ప్రకటించారు.
ధోనిపై వచ్చిన విమర్శలపై గట్టిగానే స్పందించారు. తాజాగాని ధోనిపై విమర్శలు చేస్తున్న వారిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా అజిత్ అగార్కర్‌పై సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు. ధోని ముందు అగార్కర్ చాలా చిన్నవాడని, నోరు మూసుకుంటే మంచిదని మండిపడ్డారు.
ఓ స్థానిక ఎమ్మెల్యే.. ప్రధానమంత్రిని విమర్శించడమే
పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ధోని ఎప్పుడూ మాస్టరే. అగార్కర్ ధోనిపై విమర్శలు చేయడమంటే.. ఓ స్థానిక ఎమ్మెల్యే.. ప్రధానమంత్రిని విమర్శించడమేనని శుభమ్ కవాత్రా అనే నెటిజన్ ట్వీట్ చేశాడు.
భారత క్రికెట్‌కి ఏం చేశామో ఒక్కసారి ఆలోచించుకోవాలి
ధోనిపై విమర్శలు చేసేవారు ముందుగా తాము భారత క్రికెట్‌కి ఏం చేశామో ఒక్కసారి ఆలోచించుకోవాలని ఓ నెజిటన్ అన్నాడు.
నిన్ను నీవు దిగజార్చుకుంటున్నావు
ధోని ఎప్పుడు రిటైర్ అవ్వాలో నిర్ణయించడానికి నీవెవరూ? నీ వ్యాఖ్యలతో నిన్ను నీవు దిగజార్చుకుంటున్నావు అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
మీడియా ప్రచారం కోసం ఇదంతా చేస్తున్నావ్
మీడియా ప్రచారం కోసం ఇదంతా చేస్తున్నావ్ అని సందేశ్ సింగ్ అనే అభిమాని అజిత్ అగార్కర్‌కి వార్నింగ్ ఇచ్చాడు.

ఎవరీ అగార్కర్?
ధోని ముందు అగార్కర్ చాలా చిన్నవాడని, నోరు మూసుకుంటే మంచిదని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో ఎవరీ అజిత్ అగార్కర్ ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. మహారాష్ట్రకు చెందిన అజిత్ అగార్కర్ భారత్ తరఫున 1998 నుంచి 2007 వరకు 191 వన్డేలు, 26 టెస్టు మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications