Indain T20 World Cup Squad 2021: శార్దూల్ ఠాకూర్ ఉండగా.. భువనేశ్వర్ ఎందుకు దండుగా!

హైదరాబాద్: భువనేశ్వర్ కుమార్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.! భారత జట్టు ప్రధాన పేసర్.. పవర్ ప్లేలో ప్రత్యర్థి గడగడలాడించాలన్నా.. స్లాగ్ ఓవర్‌లో బ్యాట్స్‌మెన్‌కు దూకుడుకు కళ్లెం వేయాలన్న భువీ బంతిని అందుకోవాల్సిందే. రెండు వైపుల స్వింగ్ చేయగల సామర్థ్యం.. నకుల్ బాల్స్‌తో బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించడం భువనేశ్వర్ బౌలింగ్ ప్రత్యేకత. కానీ ఇవన్నీ ఒకప్పటి మాటలే. గత కొన్నాళ్లుగా అతని ఆట లయ తప్పింది. వికెట్లు తీయడం దేవుడెరుగు.. ధారళంగా పరుగులిస్తున్నాడు. ఐపీఎల్‌లో 2021 సీజన్‌లో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీసాడంటే అతని పేలవ ఫామ్ అర్థం చేసుకోవచ్చు.

4 ఓవర్లు.. 54 రన్స్..

4 ఓవర్లు.. 54 రన్స్..

ఇక ఇంగ్లండ్‌తో సోమవారం జరిగిన టీ20 ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లోనూ ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. నాలుగు ఓవర్లు వేసి ఒక్క వికెట్ ఇవ్వకపోగా.. అందరికంటే ఎక్కువగా 54 పరుగులిచ్చుకున్నాడు. దాంతో మెగా టోర్నీ ఆరంభానికి ముందు భువీ ఫామ్ భారత క్రికెట్ వర్గాలను కలవర పెడుతోంది. అతన్ని తుది జట్టులోకి తీసుకోకపోవడమే ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భువీకి బదులు శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోవడం ఉత్తమమని అజిత్ అగార్కర్ వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మాజీ క్రికెటర్ పార్ధీవ్ పటేల్ సైతం భువీ ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు.

ఇలా అయితే ఎలా?

ఇలా అయితే ఎలా?

హార్దిక్ పాండ్యా ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడం.. భువనేశ్వర్ ధారళంగా పరుగులిస్తుండటం మెగా టోర్నీలో భారత భవిష్యత్తు ఏంటనేది అర్థం కావడం లేదన్నాడు. ‘ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ కేవలం ఐదుగురు బౌలర్లతోనే బౌలింగ్‌ చేయించాడు. దీన్ని బట్టి చూస్తే హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసేలా కనిపించడం లేదు. భువనేశ్వర్‌ కుమార్ పేలవ ఫామ్ నన్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఐపీఎల్‌లో అతను ఆరు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. భువీ లయ తప్పినట్లు కనిపిస్తున్నాడు. ప్రాక్టీస్‌ లేనట్లుగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో దారళంగా పరుగులిచ్చుకున్నాడు' అని పార్థివ్‌ పటేల్‌ అన్నాడు.

శార్దూల్ ఠాకూర్ బెస్ట్ ఆప్షన్..

శార్దూల్ ఠాకూర్ బెస్ట్ ఆప్షన్..

ఓవైపు హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోగా.. మరోవైపు భువనేశ్వర్ కుమార్ విఫలమవుతున్నాడని, ఈ సమస్యను అధిగమించాలంటే శార్ధూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకోవడం ఉత్తమమని అగార్కార్ అభిప్రాయపడ్డాడు. భువీ ప్లేస్‌లో శార్దూల్‌ను తుది జట్టులోకి తీసుకు వస్తే అటు బ్యాటింగ్ డెప్త్.. ఇటు బౌలింగ్ లైనప్ పటిష్టంగా తయారవుతుందన్నాడు. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడిన అగార్కర్.. పాకిస్థాన్‌తో బరిలోకి దిగే భారత్ తుది జట్టును అంచనా వేసాడు.

ఆరుగురు బౌలర్లు అయితే..

ఆరుగురు బౌలర్లు అయితే..

‘పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటే విరాట్ కోహ్లీ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతాడు. లేకుంటే ముగ్గురు స్పిన్నర్లు, పేసర్ల చొప్పున ఆరుగురితో ఆడాల్సిందే. జట్టులో స్పిన్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. జడేజా ఆల్‌రౌండర్. బ్యాటింగ్ చేసే సామర్థ్యం అతనికి ఉంది కాబట్టి అతన్ని టాపార్డర్ బ్యాట్స్‌మన్‌లానే ట్రీట్ చేయవచ్చు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోతే.. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తీ, రాహుల్ చాహర్‌లను తీసుకోవాలి.'అని అగార్కర్ అభిప్రాయపడ్డాడు. ఫామ్‌లో లేని భువనేశ్వర్‌ను పక్కనపెట్టడమే ఉత్తమమన్నాడు.

భువీకి అండగా కోహ్లీ..

భువీకి అండగా కోహ్లీ..

మరోవైపు భువనేశ్వర్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని విరాట్ కోహ్లీ తెలిపాడు. భువీ సైతం రిథమ్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగే రెండో వార్మప్ మ్యాచ్‌తో ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది. భువీకి అవకాశం ఇస్తారా? లేదా చూడాలి. ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్(24 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51), ఇషాన్ కిషన్(46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70), రిషభ్ పంత్(14 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 29 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(0/54), రాహుల్ చాహర్(1/43) తేలిపోగా.. మహమ్మద్ షమీ(3/40) మూడు వికెట్లతో పర్వాలేదనిపించాడు. జస్‌ప్రీత్ బుమ్రా(1/26) ఓ వికెట్ తీయగా.. అశ్విన్(0/23) కట్టడిగా బౌలింగ్ చేశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, October 19, 2021, 18:35 [IST]
Other articles published on Oct 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X