న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై సెలక్షన్‌ కమిటీకి అగార్కర్ రాజీనామా

Ajit Agarkar and others resign as Mumbai selectors

హైదరాబాద్: ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ సభ్యులు అజిత్‌ అగార్కర్‌తోపాటు మరో ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేశారు. ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ తాత్కాలిక కమిటీ సమావేశమైన కొద్ది గంటల్లోనే రాజీనామాలు ప్రకటించడం ప్రాధాన్యత ను సంతరించుకుంది.

ఐదు నిమిషాలు ఆలస్యం కావడం వల్లే: ఉగ్రదాడిపై బంగ్లా వీడియో అనలిస్ట్‌ఐదు నిమిషాలు ఆలస్యం కావడం వల్లే: ఉగ్రదాడిపై బంగ్లా వీడియో అనలిస్ట్‌

దేశవాళీ టోర్నీల్లో ముంబయి జట్టు దారుణంగా పరాజయం పాలైంది. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీల్లో అంచనాలను అందుకోలేదు. దీంతో సెలక్షన్‌ కమిటీ రాజీనామా చేయాలని ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు.

తాత్కాలిక పాలక కమిటీ దీనిపై న్యాయ సలహా తీసుకోవాలని భావించగా.. సెలక్షన్‌ కమిటీలోని సభ్యులు మాత్రం తమ రాజీనామా లేఖలు సమర్పించడం విశేషం. రాజీనామాలు చేసిన వారిలో ఛైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌, నీలేస్‌ కులకర్ణి, సునీల్‌ మోరే మరియు ఠక్కర్‌లు ఉన్నారు.

వీరంతా తమ రాజీనామా లేఖలను ఈ-మెయిల్‌లో ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌(ఎంసిఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సి.కె. నాయక్‌కు పంపారు. వన్డేల్లో అత్యంతవేగంగా 50 వికెట్లు సాధించిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టులలో కూడా 2002లో లార్డ్స్‌లో 8వ నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా బ్యాటింగ్‌కు దిగి సెంచరీ సాధించాడు.

Story first published: Saturday, March 16, 2019, 12:28 [IST]
Other articles published on Mar 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X