శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు యువ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వివరించాడు. టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్‌తో కలిసి అజిత్ అగార్కర్ సోమవారం మీడియా సమావేశంలో హాజరయ్యాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఇద్దరూ సమాధానం ఇచ్చారు.
ఇటీవల జింబాబ్వే పర్యటనలో సత్తాచాటిన రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మకు టీ20 జట్టులో అవకాశం ఇవ్వలేదు. పరుగుల వరద పారిస్తూ రుతురాజ్ ఆకట్టుకున్నాడు. మెరుపు శతకంతో అభిషేక్ రికార్డులను షేక్ చేశాడు. కానీ వీరిద్దరిపై వేటు పడింది. దీంతో శ్రీలంక టీ20 సిరీస్‌కు రుతురాజ్, అభిషేక్‌లను ఎందుకు ఎంపిక చేయలేదని అజిత్ అగార్కర్-గంభీర్‌ను మీడియా ప్రశ్నించింది.

దీనికి అజిత్ అగార్కర్ బదులిచ్చాడు. రుతురాజ్, అభిషేక్ విషయంలోనే కాదు, ఇతర ప్లేయర్లు జట్టులో స్థానం కోల్పోయినా కష్టంగానే ఉంటుందని అగార్కర్ అన్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో రింకూ సింగ్‌ది కూడా ఇదే పరిస్థితి అని, పరుగులు చేసినా కొన్నిసార్లు జట్టులో చోటు దక్కదని తెలిపాడు.
''ఏ ప్లేయర్ అయినా జట్టులో చోటు కోల్పోతే కష్టంగానే ఉంటుంది. రింకూ సింగ్ పరిస్థితి చూడండి. అతను టీ20 వరల్డ్ కప్ ముందు మంచి ప్రదర్శన చేశాడు. కానీ అతన్ని ప్రపంచకప్ జట్టులో ఎంపిక చేయలేకపోయాం. మేం 15 మందిని మాత్రమే ఎంచుకోగలం'' అని అజిత్ అగార్క్ పేర్కొన్నాడు.
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్