Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాఫ్రికా టూర్‌లో అజింకా రహానే బాగా రాణించగలడు: కోచ్ అమ్రే

Ajinkya Rahane Will Do Well in South Africa, Feels Coach Amre

హైదరాబాద్: భారత జట్టు మాజీ క్రికెటర్ ప్రవీణ్ అమ్రె అజింకా రహానేపై బలమైన నమ్మకం కనబరుస్తున్నాడు. దక్షిణాఫ్రికా టూర్‌లో అందరికంటే ఉత్తమమైన ప్రదర్శన ఇవ్వగలడనే భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ మధ్యనే మాజీ క్రికెటర్ గంగూలీ సైతం రహానే ఓ క్వాలిటీ ప్లేయర్ అని పొగిడాడు. ఇప్పుడు అతనికి తోడుగా రహానే కోచ్ అయిన అమ్రే కూడా బలపరిచే విధంగా చెప్తున్నాడు.

దక్షిణాఫ్రికా టూర్‌పై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందించిన అమ్రే.. 'టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌లో ఇదే విజయాల పరంపరతో దూసుకెళ్లాలని కోరుకుంటున్నాను. జట్టులో ఉన్న ఆటగాళ్లలో అజింకా రహానేకు అంతకుముందే దక్షిణాఫ్రికా టూర్‌లో అనుభవముంది. క్రితం సారి దక్షిణాఫ్రికా టూర్ ఇన్నింగ్స్‌లో రహానే చక్కని ప్రతిభను కనబర్చి 65 వ్యక్తిగత స్కోరును చేశాడు. '

టీమిండియా సెలక్టర్లు సైతం అతనిపై నమ్మకముంచారని గుర్గు చేశాడు. అతను చక్కగా ఆడడానికి తాను ఏదో ఒకటి చేయాలని పరితపిస్తుంటానన్నాడు. రహానేతో మంచి ప్రదర్శన చేయించడం అతని బాధ్యతని పేర్కొన్నాడు.

కొద్ది రోజులుగా మంచి ఫామ్‌లో రాణిస్తున్న శ్రేయాస్ అయ్యర్ సైతం కోచ్ అమ్రే దగ్గర శిక్షణ తీసుకున్నాడు. అంతకుముందు ఢిల్లీ డేర్ డెవిల్స్ కోచ్‌గా వ్యవహరించిన ఆయన శ్రేయాస్ కూడా బాగానే ఆడుతున్నాడని కితాబిచ్చారు. రహానే సెంచరీ చేయగలడనే నమ్మకముందన్నారు. మ్యాచ్‌ను గెలిపించడంలో తనే కీలక పాత్ర పోషిస్తాడని అభిప్రాయపడ్డారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 22, 2017, 9:54 [IST]
Other articles published on Dec 22, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+