Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'వరల్డ్‌కప్‌లో రహానే ఆడాలి'

Ajinka Rahane Should Play In World Cup Says Sanjay Jagdale | Oneindia Telugu
Ajinkya Rahane should play in World Cup, says Sanjay Jagdale

హైదరాబాద్: టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజ్యింకె రహానే ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌క‌ప్ జట్టులో కచ్చితంగా ఉండాలని మాజీ సెలక్టర్‌ సంజయ్‌ జగ్దాలె అభిప్రాయపడ్డాడు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆడటోయే భారత జట్టుపై ఇప్పటికే సెలక్టర్లు ఓ అంచనాకు వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్ అనంతరం వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయబోయే జట్టుపై పూర్తి స్పష్టత రానుంది. రాంచీ వేదికగా శుక్రవారం జరిగే మూడో వన్డేలో టీమిండియా విజయం సాధిస్తే మిగతా రెండు వన్డేల్లో జట్టు మేనేజ్‌మెంట్ ప్రయోగాలు చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

గతేడాది కాలంగా వన్డే జట్టులో చోటు కోసం రహానే తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. గతేడాది జనవరిలో సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో చివరగా వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో 34 పరుగులు సాధించాడు. అయితే, ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో భారత జట్టులో నాలుగో స్థానానికి అంబటి రాయుడు, దినేశ్‌ కార్తీక్‌ సరిపోరని మాజీ సెలక్టర్‌ సంజయ్‌ జగ్దాలె పేర్కొన్నారు.

"నాలుగో స్థానంలో అంబటి రాయుడు, దినేశ్‌ కార్తీక్‌ను ఆడించడాన్ని అంగీకరించను. రహానేకు ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం ఉంది. ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ రహానే ఆడాల్సింది. అయితే, జట్టు మేనేజ్‌మెంట్, సెలక్టర్లు అతడిపై విశ్వాసం ఉంచడం లేదు. భారత్‌ ఎంతకాలం కోహ్లీ ఒక్కడిపైనే ఆధారపడుతుంది?" అని అన్నారు.

"ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ టెస్టు సిరీసుల్లో రిషభ్‌ పంత్‌ రాణించాడు. వన్డేల్లో మాత్రం ఆడించలేదు. రిషభ్ పంత్‌ భారత భవిష్యత్తు. ఇంతకు ముందు విజయ్‌ శంకర్‌ ఆట చూడలేదు. అయితే, నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో అద్భుత ప్రదర్శన చేశాడు" అని సంజయ్‌ జగ్దాలె తెలిపాడు.

Story first published: Thursday, March 7, 2019, 16:42 [IST]
Other articles published on Mar 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+