గాలే: భారత్ - శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజులో టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ అజ్యంకె రహానే టెస్టుల్లో ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. 27 ఏళ్ల రహానే శుక్రవారం శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 5 క్యాచ్‌లను పట్టి, మొత్తంగా 8 క్యాచ్‌లను పట్టుకుని ప్రపంచ రికార్డుని సాధించాడు.
ఒకే టెస్టు మ్యాచ్‌లో వికెట్ కీపర్ కాకుండా ఫీల్డింగ్‌లో ఉంటూ 8 క్యాచ్‌లను అందుకున్న ఏకైక ఆటగాడిగా రహానే రికార్డు సృష్టించాడు. గాలే అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగినా, ఈ అరుదైన రికార్డుని సాధించాడు.

ఈ టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో రెండు, రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 క్యాచ్‌లు అందుకుని ప్రపంచ రికార్డుని సృష్టించాడు. 72.5 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి శ్రీలంక 319 పరుగుల వద్ద ఉన్నప్పుడు హార్భజన్ సింగ్ బౌలింగ్‌లో రహానే ఈ ప్రపంచ రికార్డుని సృష్టించాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రహానే 15 టెస్టుల్లో కేవలం 7 క్యాచ్‌లను మాత్రమే పట్టాడు.
తొలి టెస్టులో రహానే క్యాచ్‌లు (8):
శ్రీలంక తొలి ఇన్నింగ్స్:
1. Dimuth Karunaratne c Rahane b Ishat Sharma 9
2. Lahiru Thirimanne c Rahane b R Ashwin 13
3. Dinesh Chandimal c Rahane b Amit Mishra 59
శ్రీలంక రెండో ఇన్నింగ్స్:
4. Dhammika Prasad c Rahane b Varun Aaron 3
5. Kumar Sangakkara c Rahane b Ashwin 40
6. Thirimanne c Rahane b Ashwin 44
7. Jehan Mubarak c Rahane b Harbhajan Singh 49
8. Rangana Herath c Rahane b Mishra 1