ఫామ్ కోసం చిన్ననాటి కోచ్ వద్ద రహానే పాఠాలు
హైదరాబాద్: వెస్టిండిస్, న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరిస్‌లలో టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు అజ్యంకె రహానే పరుగుల వరద పారించాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరిస్‌లో మాత్రం తెగ ఇబ్బంది పడుతున్నాడు.
దీంతో రహానే మళ్లీ ఫామ్‌లోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం తన చిన్ననాటి బ్యాటింగ్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే సలహాలను తీసుకుంటున్నాడు. గతంలో ఫాస్ట్ పిచ్‌లపై తడబడుతున్న సమయంలో ప్రవీణ్ సలహాలతోనే తన సమస్యను పరిష్కరించుకుని విదేశాల్లో సత్తా చాటాడు.
అయితే ఇప్పుడు స్వదేశంలోని పిచ్‌లపై తన లోపాలను సవరించుకునేందుకు ఆమ్రే వద్ద పాఠాలను నేర్చుకుంటున్నాడు. ఇంగ్లాండ్‌తో ఇప్పటివరకు ముగిసిన మూడు టెస్టుల్లో 15 మంది భారత బ్యాట్స్ మెన్లు బ్యాటింగ్ చేశారు. ఈ జాబితాలో 21.63 యావరేజితో 63 పరుగులు చేసి ఐదో స్ధానంలో ఉన్నాడు.

మొహాలి టెస్టులో రహానే డకౌట్
ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన తొలిటెస్టులో 13,1 పరుగులు మాత్రమే సాధించిన రహానే, విసాఖపట్నంలో జరిగిన రెండోటెస్టులో 23, 26 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక మొహాలీ వేదికగా జరిగిన మూడో టెస్టులో రహానే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ ఐదు ఇన్నింగ్స్‌ల్లో రహానే సాధించిన పరుగులు 63. ఈ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కూడా ఇంగ్లాండ్ స్పిన్నర్లు రషీద్, అలీ, అన్సారీల బౌలింగ్‌లో రహాన్ ఔట్ కావడం విశేషం.

ఆత్మవిశ్వాసం కోల్పోయి కనిపిస్తున్న రహానే
దీనిని బట్టి చూస్తుంటే క్రీజులో కుదురుకుంటే పరుగుల వరద పారించే రహానే ఈ దెబ్బతో ఆత్మవిశ్వాసం కోల్పోయి కనిపిస్తున్నాడు. తన బ్యాటింగ్ లోపాలను సరిచేసేందుకు మళ్లీ చిన్ననాటి కోచ్ ఆమ్రే సలహాలు తీసుకుంటూ అతని పర్యవేక్షణలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సొంతగడ్డపై జరిగే నాలుగోటెస్టుతో మళ్లీ తిరిగి ఫామ్ అందుకోవాలన్న లక్ష్యంతో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మైదానంలో తీవ్ర సాధన చేస్తున్నాడు.

వాంఖడె రహానే హోం గ్రౌండ్
ముంబైలోని వాంఖడె మైదానం రహానే సొంత మైదానం కావడం, ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుండడంతో రహానే తిరిగి ఫామ్‌లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆమ్రే సైతం రహానేకు బ్యాట్ యాంగిల్‌పై దృష్టి సారించమని సలహా ఇచ్చాడు. దీంతో అతను పూర్తిస్థాయిలో బ్యాటింగ్‌పైనే మనసు లగ్నం చేస్తే వరుస వైఫల్యాలను అధిగమించే అవకాశం ఉంటుందని ఆమ్రే పేర్కొన్నాడు.

పరుగుల వరద పారిస్తాడు: ఆమ్రే
ముందుగా క్రీజులో నిలదొక్కుకున్న తర్వాతే వేగంగా ఆడేందుకు ప్రయత్నించాలని రహానేకు ఆమ్రే సలహా ఇస్తున్నాడు. బంతి గమనాన్ని సరిగా అంచనా వేయకుండా అడ్డంగా షాట్లు ఆడడాన్ని నియంత్రించుకుంటే మళ్లీ అతను పరుగుల వరద పారించడం ఖాయమని ఆమ్రే చెప్పాడు. ఇదిలా ఉంటే టీమిండియా ఆల్ రౌండ్ నైపుణ్యంతో రాణిస్తుండంతో పాటు సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉండడంతో రహానేపై అంతగా ఒత్తిడి పడే అవకాశం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications