Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కౌంటీ క్రికెట్ ఆడేందుకు అనుమతివ్వండి: బీసీసీఐకి రహానే లేఖ

Ajinkya Rahane seeks BCCI permission to play for Hampshire in county cricket

హైదరాబాద్: కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ బీసీసీఐకి దరఖాస్తు చేసుకున్నాడు భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే. ఇంగ్లాండ్‌లోని హాంప్‌షైర్‌ జట్టు తరఫున మే నుంచి జులై వరకూ కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు అనుమతి ఇవ్వాలని అందులో పేర్కొన్నాడు. ఈ మేరకు బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రికి రహానే లేఖ రాశాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ధృవీకరించిన రాహుల్ జోహ్రి

ధృవీకరించిన రాహుల్ జోహ్రి

దీనిని సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ)కు పంపిన విషయాన్ని రాహుల్‌ జోహ్రి ధృవీకరించాడు. ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ రహానే విజ్ఞప్తిని నిరాకరించడానికి ఎలాంటి కారణం లేదని ఆయన తెలిపారు.

గతంలో పలువురు క్రికెట్లరకు

గతంలో పలువురు క్రికెట్లరకు

గతంలో పలువురు క్రికెట్లరకు కౌంటీల్లో ఆడేందుకు బోర్టు అనుమతి ఇచ్చిందని, రహానే విషయంలో కూడా సానుకూలంగానే స్పందిస్తుందనే ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతేకాదు రహానే వరల్డ్‌కప్ జట్టులో సభ్యుడు కాదని, ఆ సమయంలో భారత జట్టు సైతం ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం లేదని ఆయన గుర్తుచేశారు.

గతేడాది కోహ్లీ సర్రే జట్టు తరఫున

గతేడాది కోహ్లీ సర్రే జట్టు తరఫున

"గతేడాది కోహ్లీ సర్రే జట్టు తరఫున ఆడటానికి బీసీసీఐ అనుమతి ఇచ‍్చింది. పుజారా, ఇషాంత​ శర్మలు కూడా కౌంటీ క్రికెట్‌ ఆడారు. కాబట్టి రహానేకు కౌంటీల్లో ఆడేందుకు తప్పక అనుమతి లభిస్తుంది. అందులోనే రహానే వరల్డ్‌కప్‌ జట్టులో కూడా లేడు. ఈ సమయంలో భారత జట్టు సైతం ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం లేదు" అని అన్నారు.

కౌంటీల్లో ఆడటం వల్ల మంచి అనుభవం

కౌంటీల్లో ఆడటం వల్ల మంచి అనుభవం

అంతేకాదు రహానే కౌంటీల్లో ఆడటం వల్ల మంచి అనుభవం సంపాదిస్తాడని అది టీమిండియా తరఫున టెస్టుల్లో ఆడేందుకు ఉపయోగపడుతుందని బీసీసీఐ అధికారి వివరించారు.

Story first published: Saturday, April 20, 2019, 14:23 [IST]
Other articles published on Apr 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+