Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాది సినిమాలు వైవిద్యంగా ఉంటాయి.. 'సూరరై పొట్రు' సూపర్‌గా ఉంది: రహానే

Ajinkya Rahane reveals he watched Suriyas superhit movie Soorarai Pottru

చెన్నై: టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడటానికి చెన్నైలో ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ప్రశ్నోత్తరాల సమావేశాన్ని నిర్వహించిన జింక్స్.. తమిళ చిత్రం 'సూరారై పొట్రు' సినిమాను తాను చూశానని, చిత్రం సూపర్‌గా ఉన్నదని తెలిపాడు. తనకు తమిళం రాకపోవడం వల్ల సబ్‌ టైటిల్స్‌తో అర్ధం చేసుకున్నానని చెప్పాడు. రహానే మైదానంలో చాలా ప్రశాంతంగా కనిపిస్తుంటాడు. ఎంత ఒత్తిడిలో ఉన్నా.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలానే కూల్‌గా బ్యాటింగ్ చేస్తుంటాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీలోనూ ఆసీస్ పర్యటనలో మూడు టెస్టుల్లో జట్టును అద్భుతంగా నడిపించి గొప్ప నాయకుడిగా ప్రశంసలు అందుకున్నాడు.

దక్షిణాది సినిమాలు వైవిద్యంగా ఉంటాయి:

దక్షిణాది సినిమాలు వైవిద్యంగా ఉంటాయి:

చెన్నైలో బయోబబుల్‌లో ఉన్న అజింక్య రహానే.. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో కాస్త సరదా సమయాన్ని గడిపాడు. అభిమానులు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు వరుసగా సమాధానమిచ్చాడు. 'చెన్నైకి స్వాగతం, ఎప్పుడైనా ఏదైనా తమిళ సినిమా లేదా సిరీస్ చూసారా?' అని ఓ అభిమాని అడగ్గా.. 'సూరారై పొట్రు సినిమాను చూశా. సూపర్‌గా ఉంది. సినిమాను చాలా ఇష్టపడ్డాను. హీరో సూర్య నటన అద్భుతంగా ఉంది. సినిమాలో లీనమైపోయి అలాగే చూస్తూ ఉండిపోయా. దక్షిణాది సినిమాలు వైవిద్యంగా ఉంటాయి, మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ చేస్తాయి' అని రహానే తెలిపాడు.

మిసాల్‌/ వడాపావ్‌.. ఏది ఇష్టం:

మిసాల్‌/ వడాపావ్‌.. ఏది ఇష్టం:

మిసాల్‌/ వడాపావ్‌.. ఏది ఇష్టం అని ఓ అభిమాని అజింక్య రహానేను అడగ్గా.. 'కఠినమైన ప్రశ్న అని, వడాపావ్'‌ అని బదులిచ్చాడు. ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన యువ ఆటగాళ్లు టీ నటరాజన్‌, మొహ్మద్ సిరాజ్‌, శుభ్‌మన్‌ గిల్‌, వాషింగ్టన్ సుందర్‌ గురించి చెప్పండి? అని మరొకరు అడగ్గా.. 'వాళ్లకి ఫలితం గురించి భయం లేదు. జట్టు కోసం అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ఆలోచిస్తారు. ఆటపై అంకిత భావంతో, భయంలేని క్రికెట్‌ ఆడుతున్నారు' అని జింక్స్ పేర్కొన్నాడు. మెల్‌బోర్న్‌లో శతకం సాధించిన తర్వాత ఎలా సంబరాలు చేసుకున్నారు? అని ప్రశ్నించగా.. 'వర్చువల్‌ సెలబ్రేషన్స్‌. మా భార్య, కూతురుతో వీడియో కాల్ మాట్లాడాను' అని చెప్పాడు.

సంగీతాన్ని ఆస్వాదిస్తా:

సంగీతాన్ని ఆస్వాదిస్తా:

# ఆస్ట్రేలియా జట్టులో ఎవరు ఎక్కువగా కవ్వించేవారు?

ఆసీస్‌ జట్టులో అందరూ ఎంతో మర్యాదస్తులు.

# క్రికెట్‌ ఆడని సమయాల్లో మీరేం చేస్తుంటారు?

సంగీతాన్ని ఆస్వాదిస్తా.

# ఫేవరేట్‌ సాంగ్‌?

లక్ష్య సినిమాలోని 'కందోన్‌ సె మిల్తే హై కందే'.

# కరోనా విజృంభించిన తర్వాత ఎన్నాళ్లకు తిరిగి క్రికెట్ ఆడారు?

ఆరు నెలలు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఏర్పాటు చేసిన శిబిరంలో ఆడా.

ఆమె నా సోదరి స్నేహితురాలు:

ఆమె నా సోదరి స్నేహితురాలు:

# రోహిత్‌ శర్మ గురించి చెప్పండి?

రోహిత్‌ నా సోదరుడు.

# రూమ్‌లో ఏం చేస్తుంటారు?

క్రికెట్ ప్రాక్టీస్ చేస్తా.

# మీ భార్య (రాధిక)ను ఎలా కలిశారు?

ఒకే ప్రాంతంలో ఉండేవాళ్లం. ఆమె నా సోదరి స్నేహితురాలు.

ఐపీఎల్‌ 2021లో ఆడే ఛాన్స్ ఇవ్వండి.. నేనేంటో నిరూపించుకుంటా: పుజారా

Story first published: Saturday, January 30, 2021, 20:54 [IST]
Other articles published on Jan 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+