Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓటమికి అసలు కారణం అదే: అజింక్యా రహానే

KKR vs CSK: చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ మే 7న జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్ల తేడాతో కేకేఆర్‌ను ఓడించింది. ఈ ఓటమి తర్వాత ప్లేఆఫ్స్ రేసులో కేకేఆర్ ప్రయాణం దాదాపుగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతంగా ఆడింది. ఓటమి అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఓటమికి గల కారణాలను వివరిస్తూ నిరాశను వ్యక్తం చేశాడు.

ఓటమికి కారణం చెప్పిన రహానే
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో 2 వికెట్ల తేడాతో ఈ‌ పరాజయం మాకు చాలా కష్టమైన విషయమని కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే అన్నాడు. తాము 10-15 పరుగులు తక్కువగా ఉన్నామని తెలిపాడు. ఈ పిచ్‌పై 185-195 పరుగుల స్కోరు ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. కేకేఆర్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారని.. కానీ ఓటమిని భరించడం ఇంకా కష్టమని తెలిపాడు.

Ajinkya Rahane Reacts to KKR s Defeat Against CSK

డెవాల్డ్ బ్రెవిస్ ఒకే ఓవర్లో 30 పరుగులు చేశాడని.. ఇది టీ20 ఫార్మాట్‌లో జరుగుతుందని అజింక్యా రహానే చెప్పుకొచ్చాడు. కేవలం ఒకే ఓవర్ మ్యాచ్ గమనాన్ని మార్చగలదన్నాడు. డెవాల్డ్ బ్రెవిస్, శివం దూబే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని అన్నాడు. వారి ధైర్యం ఫలించిందని రహానే స్పష్టం చేశాడు. మాకు ఎటువంటి ఫిర్యాదులు లేవని.. కేకేఆర్ బౌలర్లు తమ శాయశక్తులా ప్రయత్నించారన్నాడు. తాము తదపరి రెండు మ్యాచ్‌లలో గెలవడానికి ప్రయత్నిస్తామన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దామంటూ రహానే చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ పరిస్థితి ఇలా..
మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కేకేఆర్ తరఫున కెప్టెన్ అజింక్యా రహానే అత్యధిక పరుగులు చేశాడు. రహానే 33 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. దీనితో పాటు మనీష్ పాండే 28 బంతుల్లో 36 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది కాకుండా ఆండ్రీ రస్సెల్ 21 బంతుల్లో 38 పరుగులు చేశాడు. కేకేఆర్ నుంచి ఏ బ్యాటర్ కూడా అర్థ సెంచరీ చేయలేకపోయారు,

లక్ష్య ఛేదనలో సీఎస్కే మంచి ఆరంభం లభించలేదు. తొలి ఓవర్ రెండో బంతికి ఓపెనర్ ఆయుష్ మాత్రే ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. డెవాన్ కాన్వే కూడా 2 బంతుల్లోనే డకౌట్ అయ్యాడు. అయితే మూడో స్థానంలో ఉర్విల్ పటేల్ 11 బంతుల్లో 33 పరుగులు చేసి ఫాస్ట్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్ 25 బంతుల్లో 52 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. శివం దూబే కూడా 40 బంతుల్లో 45 పరుగులు చేసి తెలివిగా బ్యాటింగ్ చేశాడు. చివరికి సీఎస్కే 2 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది.

Story first published: Thursday, May 8, 2025, 8:28 [IST]
Other articles published on May 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+