Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సుదీర్ఘకాల కెప్టెన్‌గా కోహ్లీ పనికిరాడు: స్మిత్ వ్యాఖ్యలతో విభేదించిన దాదా

 Ajinkya Rahane must for India overseas: Sourav Ganguly

హైదరాబాద్: సఫారీ పర్యటనలో వరుసగా రెండు టెస్టుల్లో ఓటమిపాలై సిరిస్‌ను చేజార్చుకుని విమర్శలను ఎదుర్కొంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. అంతేకాదు విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ చేసిన వ్యాఖ్యలు చాలు పరుషంగా ఉన్నాయని పేర్కొన్నాడు.

స్వదేశంలో వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్‌ విజయాలు భారత్‌కు అందించిన విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా పర్యటనలో మాత్రం ఆ విజయపరంపరను కొనసాగించలేకపోయిన సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా కేప్‌టౌన్‌, సెంచూరియన్‌లలో జరిగిన టెస్టుల్లో కోహ్లీసేన ఓటమి పాలైంది.

ఈ ఓటమికి కారణాలను విశ్లేషిస్తే తుది జట్టు ఎంపికతో పాటు భారత బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శనే కారణమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా విదేశాల్లో మంచి రికార్డు ఉన్న రహానేను తొలి టెస్టు టెస్టుల్లో బెంచికే పరిమితం చేయడంతో పాటు ఫామ్‌లో ఉన్న భువనేశ్వర్ కుమార్‌ను సెంచూరియన్ టెస్టు నుంచి తప్పించడం మొదలైనవి.

ఇదే విషయాన్ని సెంచూరియన్ టెస్టు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో విలేకరులు కోహ్లీని ప్రశ్నిస్తే వారితో కోపంగా మాట్లాడాడు. మూడు టెస్టు నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన గ్రేమ్ స్మిత్ టీమిండియాకు దీర్ఘకాలిక కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి సరైన ఆప్షన్‌ కాదని పేర్కొన్న సంగతి తెలిసిందే.

'భారత జట్టుకు కోహ్లీ సుదీర్ఘకాల కెప్టెన్‌గా మనగలుగుతాడో లేదో చెప్పలేను. ఈ ఏడాది ముగిసే వరకు విదేశాల్లోనే పర్యటించాల్సి ఉంది. తీవ్ర ఒత్తిడి ఉంటుంది. మీడియా నుంచి ఇష్టంలేని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. సొంత దేశంలో అతడికి మద్దతు ఉంటుంది కానీ విదేశాల్లో మాత్రం అలా ఉండదు. జట్టు పరంగా విఫలమై ఇబ్బందులు పడుతుంటే ఆ భారం కోహ్లీ మోయగలడో లేదో' అని స్మిత్‌ అన్నాడు.

అయితే స్మిత్‌ వ్యాఖ్యలపై గంగూలీ విభేదించాడు. 'స్మిత్‌ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. విరాట్‌ కోహ్లీ యువ కెప్టెన్. కెప్టెన్‌గా అతనికిది తొలి పూర్తిస్థాయి విదేశీ పర్యటన. ఇంత పరుషమైన ప్రకటన చేయడం సరికాదు. కొన్ని నెలల్లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పర్యటనలు ఉన్నాయి. అక్కడ అతను నేర్చుకుంటారు. స్మిత్‌ గొప్ప కెప్టెనే కానీ, కోహ్లీపై అతని అభిప్రాయాలతో ఏకీభవించడం లేదు' అని గంగూలీ పేర్కొన్నాడు.

ఇక, తొలి రెండు టెస్టులకు రహానేను పక్కన బెట్టాలన్న విరాట్ కోహ్లీ, జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయంపై సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. విదేశాల్లో జరిగే టెస్టుల్లో రహానేను తప్పక ఆడించాలని సూచించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 24, 2018, 12:48 [IST]
Other articles published on Jan 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+