న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విదేశీ పిచ్‌లపై మేమెప్పుడూ వ్యాఖ్యలు చేయలేదు.. నాలుగో టెస్టుకు స్పిన్‌ పిచ్‌ సిద్ధం: రహానే

Ajinkya Rahane hints Pitch for the 4th Test to be similar to the previous two matches
Ind vs Eng 2021,4th Test : Pitch For 4th Test Will Be Similar To Last Two Tests - Ajinkya Rahane

అహ్మదాబాద్‌: భారత్‌లో స్పిన్‌ పిచ్‌లపై ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు కానీ విదేశాలకు వెళ్లినప్పుడు తాము ఎప్పుడూ బౌన్సీ పిచ్‌ల గురించి ఫిర్యాదు చేయలేదని టీమిండియా టెస్ట్ వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే అన్నాడు. చివరి టెస్టు ఆడనున్న పిచ్‌ కూడా గత రెండు మ్యాచ్‌ల మాదిరిగానే స్పిన్‌కు సహకరిస్తుందని స్పష్టంచేశాడు. అయితే చెన్నైలో రెండో టెస్టు జరిగిన పిచ్‌ మాదిరిగా ఉండొచ్చని రహానే అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు ప్రారంభానికి ముందు రహానే మీడియాతో మాట్లాడాడు.

మేమెప్పుడూ ఫిర్యాదు చేయలేదు

మేమెప్పుడూ ఫిర్యాదు చేయలేదు

'అహ్మదాబాద్‌లోనే జరిగే నాలుగో టెస్టులో పిచ్‌.. చెన్నైలో ఆడిన స్పిన్‌ ట్రాక్‌ మాదిరే ఉండొచ్చు. గులాబి టెస్టులో బంతి ఎర్ర బంతితో పోలిస్తే చాలా వేగంగా బ్యాట్స్‌మెన్‌ వైపు దూసుకొచ్చింది. దీనికి తగ్గట్టుగా బ్యాటింగ్‌లో సర్దుబాట్లు చేసుకోవాలి. మేము విదేశాల్లో పర్యటించినప్పుడు పేస్‌ వికెట్ల గురించి అసలు చర్చే జరగదు. ఒకవేళ మంచి ప్రదర్శన చేయలేకపోతే.. బ్యాట్స్‌మెన్‌ టెక్నిక్‌ గురించే మాట్లాడుతారు. అలాంటిది మనదేశంలో మాత్రం వికెట్‌ గురించి చర్చ జరుగుతుంది. మాట్లాడేవాళ్లను మాట్లాడుకోనివ్వండి. వాటి గురించి మేం పట్టించుకోం' అని టెస్ట్ వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే అన్నాడు.

ఆటకన్నా ఎక్కువ పిచ్‌ గురించే

ఆటకన్నా ఎక్కువ పిచ్‌ గురించే

'విదేశీ పర్యటనల్లో మాకు తొలిరోజే పచ్చికతో కూడిన సీమింగ్‌ వికెట్‌ దర్శనమిచ్చినా.. మేము ఏరోజు దాని గురించి మాట్లాడలేదు. అలాంటిది స్పిన్‌ వికెట్లపైకి వచ్చేసరికి ఆటకన్నా ఎక్కువ పిచ్‌ గురించే చర్చ జరుగుతుంది. మరీ అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. బంతి స్పిన్‌ అవుతుంటే.. లైన్‌ను బట్టి బ్యాటింగ్‌ చేయాలి. ఫుట్‌వర్క్‌ను నమ్ముకుంటూ డిఫెన్స్‌పై ఆధారపడి ఇన్నింగ్స్‌ను నిర్మించాలి. కొత్త బ్యాట్స్‌మన్‌ క్రీజులోకి రాగానే అతడి సహచరుడు పిచ్‌ పరిస్థితుల గురించి వివరించాలి. స్పిన్‌ పిచ్‌లపై బ్యాటింగ్‌ సవాలుతో కూడుకున్నదే. నిలదొక్కుకుంటే పరుగులు చేయడం పెద్ద కష్టమేం కాదు' అని జింక్స్ పేర్కొన్నాడు.

ప్రపంచకప్‌తో సమానం

ప్రపంచకప్‌తో సమానం

లార్డ్స్‌లో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ గెలవడం తమకు ప్రపంచకప్‌తో సమానమని రహానే చెప్పాడు. 'ఇషాంత్‌ శర్మ చెప్పింది నిజం. మేము నాలుగో టెస్టు గెలవడంతో పాటు లార్డ్స్‌ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ గెలవడం లక్ష్యంగా పెట్టుకున్నాం. టెస్టు చాంపియన్‌ విజయం మాకు ప్రపంచకప్‌తో సమానం. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టులో విజయం సాధించడం చాలా అవసరం' అని కింక్స్ తెలిపాడు.

ఉమేశ్‌ అందుబాటులోకి రావడం సంతోషం

ఉమేశ్‌ అందుబాటులోకి రావడం సంతోషం

గత రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ప్రదర్శన బాగుందని అజింక్య రహానే అన్నాడు. ఉమేశ్‌ యాదవ్‌ అందుబాటులోకి రావడం సంతోషమని చెప్పాడు. వ్యక్తిగత కారణాలతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగో టెస్టుకు దూరమయిన విషయం తెలిసిందే. ఇక ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి మొతెరాలో ఆఖరి మ్యాచ్‌ ప్రారంభం కానుండగా.. ప్రస్తుతం టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌ను 'డ్రా' చేసుకున్నా భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించనున్న విషయం తెలిసిందే.

ఐపీఎల్‌లో ఆటకు విలువ లేదు.. డబ్బుకే ప్రాధాన్యం ఎక్కువ! పీఎస్‌ఎల్‌, ఎల్‌పీఎల్‌ బెటర్: స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు

Story first published: Wednesday, March 3, 2021, 8:40 [IST]
Other articles published on Mar 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X