Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గాయం కారణంగా అజింక్యా రహానే ఐపీఎల్‌కు, ఇంగ్లాండ్ టూర్‌కు దూరం

Ajinkya Rahane has been ruled out of the IPL and England tour due to injury

కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ అజింక్య రహానే ఐపీఎల్ 2022లో మిగిలిన సీజన్‌‌కు అలాగే అప్ కమింగ్ ఇంగ్లాండ్ టూర్‌కు దూరం కానున్నాడు. గ్రేడ్ 3 హమ్‌స్ట్రింగ్ (స్నాయువు) గాయం కారణంగా అతన్ని రాబోయే ఇంగ్లాండ్ పర్యటనకు సెలక్టర్లు దూరం పెట్టనున్నారు. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లలో అంతంత మాత్రంగా రాణించడంతో రహానేను కొన్ని మ్యాచ్‌లకు కోల్ కతా జట్టు బెంచ్‌కే పరిమితం చేసింది. ఇక వరుస పరాజయాల అనంతరం కోల్ కతా టీంలో భారీ మార్పులు చోటుచేసుకోగా మళ్లీ రహానే జట్టులోకి వచ్చాడు. ఇక కేకేఆర్ ప్లేయింగ్ 11లో ఓపెనర్‌గా అంతో ఇంతో ఆడుతున్నాడు. ఇక మిగిలిన ఒక మ్యాచ్ ముంగిట రహానేకు భారీ సంకట స్థితి నెలకొంది. మే 14న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన మ్యాచ్‌లో 28పరుగులతో నిలదొక్కుకున్న అతను గాయపడ్డాడు. ఇక హమ్ స్ట్రింగ్ గాయం వల్ల అతను తీవ్రంగా ఇబ్బంది పడుతుండడంతో ఇక ఈ ఐపీఎల్ తో సహా.. రాబోయే ఇంగ్లాండ్ టూర్‌కు దూరమయ్యాడు.

జూన్ జూలై నెలలో భారత్ - ఇంగ్లాండ్ మధ్య రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ ఒకటి, టీ20 సిరీస్ జరగనుంది. ఈ టూర్‌లో టెస్ట్ జట్టులో రహానే ఆడాల్సి ఉండగా.. గాయం వల్ల దూరం కానున్నాడు. ఈ టూర్ రహానేకు చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే భారత జట్టులో పోటీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ టెస్టు మ్యాచ్ కు ఎంపికైతే ఆ మ్యాచ్ లో రాణించి తన స్థానాన్ని పదిలం చేసుకునే అవకాశముంటుంది. కానీ గాయం రహానేను దెబ్బతీసింది. క్రిక్‌బజ్‌ నివేదికల ప్రకారం.. గాయం నుంచి కోలుకోవడానికి అతన్ని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి బీసీసీఐ వర్గాలు పంపించనున్నాయి. అతను కాంట్రాక్ట్ ప్లేయర్ కాబట్టి గాయపడితే కోలుకోవడానికి అకాడమీలో చికిత్స, శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఐపీఎల్లో ఆడిన 7 మ్యాచ్‌లలో రహానే 133పరుగులు మాత్రమే చేశాడు. అతని ఎవరేజ్ 19గా ఉండగా.. స్ట్రైక్ రేటు 103గా ఉంది. ఇక మిగిలిన లాస్ట్ మ్యాచ్ కు రహానే లేకున్నా కేకేఆర్‌కు పెద్ద నష్టమేమీ లేదు.

ఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వర్సెస్ సన్ రైజర్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ 55పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఓటమిపాలై ప్లే ఆఫ్స్ అవకాశాలను 99.9శాతం చేజార్చుకుంది. 12మ్యాచ్‌ల్లో 5 గెలిచి 10పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్ మిగిలిన 2 గెలిచినా ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. మరోవైపు విజయం సాధించిన కోల్‌కతా జట్టు ఎంత కష్టపడ్డా చివర్లో మిగతా జట్ల జయాపజయాలే ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలను నిర్దేశిస్తాయి.

Story first published: Monday, May 16, 2022, 17:38 [IST]
Other articles published on May 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+