న్యూఢిల్లీ: బ్యాటింగ్‌కు దిగగానే తనను తాను బాస్‌గా ఊహించుకుంటానని, మ్యాచ్ బాధ్యత తనదే అన్నట్లు భావిస్తానని టీమిండియా బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే అన్నాడు. అయితే అది అతివిశ్వాసం కాదని చెప్పాడు.
'మైదానంలోకి రాగానే నన్ను నేను బాస్‌గా ఊహించుకుంటా. మ్యాచ్ బాధ్యత నాదే అనుకుంటా. అలా అని నేను అతివిశ్వాసం ఉన్నవాడ్ని కాదు. పరిస్థితులను కూడా గౌరవిస్తా' అని రహానే పేర్కొన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో వివిధ స్థానాల్లో ఆడుతూ చాలా నేర్చుకున్నానని అతడు చెప్పాడు.
'మొదట్లో రంజీల్లో ముంబై తరఫున ఓపెనర్‌గా ఆడేవాడ్ని. ఇప్పుడు టీమిండియాకు మిడిలార్డర్లో ఆడుతున్నా. ఇలా వివిధ స్థానాల్లో ఆడటం నాకు చాలా నేర్పింది. మానసికంగా నన్ను దృఢంగా మార్చింది' అని తెలిపాడు.

మధ్యతరగతి కుటుంబానికి చెందిన తాను ప్రస్తుత స్థాయిని అందుకోవడంలో తన కోచ్‌ల పాత్ర చాలా ఉందని రహానె చెప్పాడు. బ్రాండ్ విలువను పెంచుకోవడం గురించి తాను ఆలోచించనని.. తాను ఆట మీద దృష్టి పెడితే మిగతా విషయాలు వాటికవే సర్దుకుంటాయని చెప్పుకొచ్చాడు.
కాగా, చిన్నప్పటి నుంచి తనకు మొహమాటం ఎక్కువేనని.. తన భార్య కూడా ఇంకాస్త ఎక్కువగా మాట్లాడమని తనకు సలహాలిస్తుంటుందని రహానే చెప్పాడు.
ఉన్నతస్థాయికి చేరుకోవడానికి షార్ట్‌కట్స్ ఏమీ ఉండవని, అందుకు నిరంతరం శ్రమించాలని అన్నాడు. పరిస్థితులను తలచుకుని ఒత్తిడికి గురికావొద్దని, స్వేచ్ఛగా ఆడాలని విరాట్ కోహ్లీ తనకు చెబుతుంటాడని రహానే తెలిపాడు.