For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ టీమిండియా జెర్సీని ధరించాలనుకుంటున్నా..:స్టార్ క్రికెటర్

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 జోరుగా కొనసాగుతోంది. 18వ సీజన్‌‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అజింక్యా రహానే టీమిండియాలోకి తిరిగి రావడం గురించి కీలక ప్రకటన చేశాడు. రెండేళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉన్న రహానే మాట్లాడుతూ.. ప్రతిరోజూ తాను నిద్ర లేచినప్పుడు తాను ఏ లక్ష్యాలను సాధించాలనుకుంటున్నానో ఆలోచిస్తానని.. తనకు దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే మరీది ముఖ్యమైనది కాదన్నాడు. తాను తన దేశానికి ప్రాతినిధ్య వహించాలనుకుంటున్నాన్నాడు. తాను మళ్లీ టీమిండియా జెర్సీ ధరించాలనుకుంటున్నట్లు అజింక్య రహానే తన మనస్సులోని మాటను బయటపెట్టాడు.

టీమిండియా నుంచి తొలగించబడిన తర్వాత అజింక్యా రహానే తన బాధను వ్యక్తం చేశాడు. తాను ఎప్పుడూ మైదానంలో బాగా రాణించేందుకే ప్రయత్నం చేస్తూ ఉంటానని రహానే చెప్పుకొచ్చాడు. తాను 100 శాతం కంటే ఎక్కువ ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. అజింక్య రహానే చివరిసారిగా 2023లో భారత్ తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అజింక్య రహానే దశాబ్ధం పాటు టీమిండియాలో కీలకంగా ఉన్నాడు. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. అయినప్పటికీ ఇంకా టీమిండియా తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రకటన ద్వారా తాను ఆడటానికి సిద్ధంగా ఉన్నానని.. తన పేరును పరిగణనలోకి తీసుకోవాలని సెలెక్టర్లకు స్పష్టమైన సందేశం ఇచ్చాడు.

Ajinkya Rahane Eyes Team India Comeback After Strong IPL 2025 Season

నిజానికి ఐపీఎల్ 2025 తర్వాత జూన్‌లో భారత జట్టు 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటించబోతోంది. ఈ సిరీస్‌కు ముందు అజింక్యా రహానే తన సన్నాహాలను ప్రస్తావించాడు. తనలో ఇంకా ఆ ఆకలి, అభిరుచి మిగిలి ఉన్నాయని స్పష్టంగా చెప్పాడు.

ఐపీఎల్ 2025లో కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు
ఐపీఎల్‌లో అజింక్యా రహానే మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ కుడిచేతి వాటం స్టార్ బ్యాటర్ ఇప్పటివరకు కోల్‌కతా తరఫున ఆడిన 10 మ్యాచ్‌ల్లో 297 పరుగులు చేశాడు. ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రహానే నిలిచాడు.

అజింక్యా రహానే క్రికెట్ కెరీర్ ఇలా..
అజింక్యా రహానే ఇప్పటివరకు టీమిండియా తరఫున 85 టెస్టు మ్యాచ్‌ల్లో 38.46 సగటుతో 10256 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. రహానే 90 వన్డేల్లో 35.26 సగటుతో 3767 పరుగులు చేశాడు. రహానే 20 టీ20 మ్యాచ్‌ల్లో 375 పరుగులు చేశాడు.

Story first published: Saturday, May 3, 2025, 15:31 [IST]
Other articles published on May 3, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+