
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆ బాధ్యతలను నెత్తిమీదేసుకున్నాడు. 2014 నుంచి భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న కోహ్లీపై జట్టులోని ఆటగాళ్లు పలు సందర్భాల్లో ఒక్కో రకంగా పొగిడిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లీ పెళ్లి నిమిత్తం కొద్ది రోజులుగా అంతర్జాతీయ క్రికెట్‌కు అందుబాటులో లేదు.
తాత్కాలికంగా ఆ బాధ్యతలను రోహిత్ శర్మ అందుకున్నాడు. అయితే కోహ్లీ కంటే రోహిత్ శర్మే కెప్టెన్సీలోనే టీమిండియా విజయాలు సాధిస్తుందని పలువురు విమర్శకులు అభిప్రాయపడుతున్న తరుణంలో ప్రస్తుత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ అజింకా రహానె విరాట్ కోహ్లీ నాయకత్వంపై పలు ప్రశంసలు కురిపిస్తున్నాడు.
'కోహ్లీ మా మంచి నాయకుడు. జట్టుకు ఒక ప్రేరణగా ఉంటాడు. ఎప్పడూ జట్టును ముందుండి నడిపిస్తాడు. జట్టుతో అతను మాట్లాడే మాటల్లో ఒక భరోసాని వ్యక్తం చేస్తాడు. జట్టులోని అందరి ఆటగాళ్లతోనూ వ్యక్తిగతంగా మంచి సంబంధాన్ని కొనసాగిస్తాడు.' అంటూ తన పొగడ్తలతోనే ముంచెస్తున్నాడు.
2018 నుంచి అందుబాటులో రానున్న కోహ్లీని ఉద్దేశించి కోహ్లీ సారథ్యంలో భారత్ జట్టు దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లనుంది. భారత్ ఇదే స్థాయిలో రాణించి అక్కడ కూడా విజయకేతనం ఎగరేయాలని కోరుకుంటున్నానన్నాడు.
ఇప్పటికే కోహ్లీ మైదానంలో వీర విహారం చేసి 2017కి గాను 2,818పరుగులను నమోదు చేశాడు. ఈ భారీ స్కోరుతో అతను ప్రపంచ స్థాయి ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడంటూ ఐసీసీ ఈ మధ్యనే ర్యాంకింగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
విమర్శకుల అంచనా మేరకు ప్రస్తుతం టీమిండియా బ్యాలెన్స్‌డ్‌గా ఆడుతుంది. అయితే అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది. జట్టును భారీ స్కోరు దిశగా పరుగులు పెట్టించాలంటే కోహ్లీ కావాలసిందే. రావలసిందే..
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.