దిగ్గజాల సరసన రహానే: విండిస్ పర్యటనలో అరుదైన రికార్డు
హైదరాబాద్: ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చెలరేగిపోతున్న టీమిండియా క్రికెటర్ అజ్యింకె రహానే అరుదైన రికార్డును అందుకున్నాడు. ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసేన వెస్టిండిస్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్‌కి జోడిగా రహానే బరిలోకి దిగుతున్నాడు.
ఈ క్రమంలో రహానే వరుసగా నాలుగు వన్డేల్లో నాలుగు అర్ధసెంచరీలు చేశాడు. దీంతో ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో యాభైకి పైగా స్కోర్లను నాలుగుసార్లు నమోదు చేసిన మూడో భారత ఓపెనర్‌గా రహానే గుర్తింపు పొందాడు. ఆదివారం ఆంటిగ్వాలో వెస్టిండిస్‌తో జరిగిన నాలుగో వన్డేలో రహానే 60 పరుగులు చేయడం ద్వారా ఆ ఘనతను సాధించాడు.

వరుసగా నాలుగు అర్ధసెంచరీలు
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం టీమిండియా ఇంగ్లాండ్ నుంచి నేరుగా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మకి విశ్రాంతి ఇవ్వడంతో అతని స్థానంలో వెస్టిండిస్ పర్యటనలో ఓపెనర్‌గా బరిలోకి దిగుతోన్న రహానే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.

క్రికెట్ దిగ్గజాల సరసన రహానే
ఈ సిరీస్ లో తొలి వన్డేలో 62 పరుగులు చేసిన రహానే.. రెండో వన్డేలో 103 పరుగులు సాధించాడు. ఇక మూడో వన్డేలో 72 పరుగులు నమోదు చేయగా, ఆదివారం జరిగిన నాలుగో వన్డేల్లో రహానే 91 బంతుల్లో 60 పరుగులు సాధించాడు. తద్వారా రహానే క్రికెట్ దిగ్గజాల సరసన నిలిచాడు.

రెండేసార్లు ఘనత సాధించిన సచిన్, అజహరుద్దీన్
ఇలా వరుసగా నాలుగుసార్లు యాభైకి పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్, అజహరుద్దీన్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, సౌరవ్ గంగూలీ, సురేశ్ రైనాలు ఉన్నారు. ఇందులో సచిన్(1996, 2003), అజహరుద్దీన్(1990-93)లు రెండేసార్లు ఈ ఘనతను సాధించారు.

వన్డే ఫార్మాట్‌లో రాహుల్ ద్రవిడ్, టెండూల్కర్, కోహ్లీలు
గంగూలీ(2002), కోహ్లీ(2010), ధోని(2011), రైనా(2013) తలో ఒక్కసారి వరుసగా నాలుగుసార్లు యాభైకి పరుగుల్ని సాధించిన జాబితాలో ఉన్నారు. ఇక వన్డే ఫార్మాట్‌లో రాహుల్ ద్రవిడ్, టెండూల్కర్, కోహ్లీలు వరుసగా ఐదుసార్లు అర్ధ సెంచరీలు సాధించి భారత్ తరపున సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications