Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాఫ్రికాతో పోటీ పడటమంటే కత్తిమీద సామే

Ajinkya Rahane confident of doing well in South Africa, says 2013 experience will help

హైదరాబాద్: జనవరి 5న మొదలు కానున్న దక్షిణాఫ్రికా-భారత్ టెస్ట్ మ్యాచ్‌ను ఉద్దేశించి రహానె మీడియాతో ముచ్చటించాడు. ఆ జట్టుతో ఆడటమంటే కత్తి మీద సాము లాంటిదే అని వ్యాఖ్యానించాడు.

అంతేరీతిలో భారత్ కూడా కట్టుదిట్టమైన జట్టును కలిగి ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌ మొత్తంలో తాను కచ్చితంగా రాణించగలననే ధీమాని వ్యక్తం చేశాడు. ' ఇది కచ్చితంగా మాకు పెద్ద సిరీసే. దక్షిణాఫ్రికాలో వారితో ఎప్పుడూ తలపడినా మాకు ఛాలెంజ్‌గానే ఉంటుంది.

కాకపోతే 2013లో పర్యటించిన భారత జట్టుకు.. నేటి జట్టుకు చాలా తేడా ఉంది. ప్రస్తుత భారత జట్టు చాలా బలంగా ఉంది. 2013లో దక్షిణాఫ్రికాలో ఆడిన అనుభవం తనకు కలిసొస్తుందనే నమ్మకంతో ఉన్నానన్నాడు. అయితే సఫారీలతో పోరంటే అంత ఈజీ కాదని అభిప్రాయపడ్డ రహానే.. వారితో ద్వైపాక్షిక సిరీస్‌ ఎప్పుడూ సవాలేనన్నాడు.

మా కాంబినేషన్లు బాగా కుదిరాయి. దీంతో మేము సఫారీ గడ్డపై మా సత్తా చాటుతాం. ప్రధానంగా సఫారీ గడ్డపై బ్యాట్స్‌మెన్‌లకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. దక్షిణాఫ్రికా తరహా పిచ్‌ల్లో రాణిస్తేనే మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది' అని రహానే పేర్కొన్నాడు. అన్ని ప్రదేశాల కంటే ఈ ప్రదేశం విభిన్నమైనదంటూ పేర్కొన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 29, 2017, 17:34 [IST]
Other articles published on Dec 29, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+