Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నీ జీవితంలో సరదా పార్ట్‌ మొదలైంది: పండంటి పాపకు జన్మనిచ్చిన రహానే భార్య

Rahane

హైదరాబాద్: టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ రహానే తండ్రి అయ్యాడు. రహానే భార్య రాధికా ధోపావ్‌కర్‌ శనివారం పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుంత రహానే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో ఆడుతున్నాడు. విశాఖపట్నం వేదికగా తొలి టెస్టు ఇరు జట్ల మధ్య బుధవారం ఆరంభమైంది.

అయితే, రహానేకు పాప పుట్టిన విషయాన్ని మొదటగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా రహానేకు శుభాకాంక్షలు కూడా తెలిపాడు. భజ్జీ తన ట్విట్టర్‌లో "కొత్త తండ్రికి అభినందలు. రహానే భార్య రాధికతోపాటు చిన్నారి ప్రిన్స్‌కు అభినందనలు. వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నా. రహానే.. ఇప్పుడే నీ జీవితంలో సరదా పార్ట్‌ మొదలైంది" అంటూ ట్వీట్ చేశాడు.

భజ్జీ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ పలువురు అభిమానులు రహానేకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2014లో రహానే మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం రాధికను పెళ్లాడాడు. వీరి పెళ్లికి అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. రాధికా మరెవరో కాదు రహానే చిన్ననాటి స్నేహితురాలు.

Story first published: Saturday, October 5, 2019, 13:31 [IST]
Other articles published on Oct 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+