
అద్భుత బౌలింగ్:
మెల్‌బోర్న్ టెస్ట్‌లో తొలి ఓవర్ వేసేందుకు మొహ్మద్ సిరాజ్‌కు 28 ఓవర్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాను భారీ స్కోర్ దిశగా తీసుకువెళ్తున్న మార్నస్ లబుషేన్ వికెట్‌ను సిరాజ్ తీయడం విశేషం. సిరాజ్ తన 8 ఓవర్‌లోని మూడవ బంతికి వికెట్ తీశాడు. సిరాజ్ వేసిన బంతిని లబుషేన్ హుక్ చేయాలనుకున్నాడు. కానీ లెగ్‌సైడ్‌లో ఉన్న గిల్ ఆ క్యాచ్ అందుకున్నాడు. మరో కీలక ప్లేయర్ కెమరూన్ గ్రీన్‌ను.. సిరాజ్ ఎల్బీడబ్ల్యూ ఔట్ చేశాడు. వికెట్లు ముందే గ్రీన్‌ను పట్టేశాడు. దీంతో అంపైర్ పౌల్ రైఫిల్ ఈజీగా అతనికి ఔట్ ఇచ్చేశాడు. బ్యాట్స్‌మెన్ డీఆర్ఎస్‌కు వెళ్లినా.. ఫలితం లేకుండా పోయింది.

సూపర్ ఫీల్డింగ్:
మొహ్మద్ సిరాజ్ వేస్తున్న స్పీడ్ బంతులను ఆసీస్ కామెంటేటర్లు కూడా మెచ్చుకున్నారు. అసాధారణ రీతిలో సిరాజ్ బౌలింగ్ వేస్తున్నట్లు మెచ్చుకున్నారు. ఫీల్డింగ్‌లో కూడా సిరాజ్ సత్తా చాటాడు. బుమ్రా బౌలింగ్ మిచెల్ స్టార్క్ షాట్ ఆడగా.. బంతి గాల్లోకి ఎగిరింది. దాన్ని ఫైన్ లెగ్‌లో ఉన్న సిరాజ్ అద్భుతంగా అందుకున్నాడు. ఆపై జడేజా బౌలింగ్ భారీ షాట్‌కు వెళ్లిన కమ్మిన్స్‌ను.. లాంగాన్‌లో సిరాజ్ పట్టేశాడు. అంతకుముందు ఉదయం స్పిన్నర్ ఆర్ అశ్విన్.. సిరాజ్‌కు అరంగేట్రం క్యాప్ అందించాడు. టీమిడియా తరపున టెస్టులకు ఆడుతున్న 298వ ప్లేయర్‌గా సిరాజ్ నిలిచాడు.

వినూత్న రీతిలో గౌరవం:
అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన మహ్మద్ సిరాజ్‌ను టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే వినూత్న రీతిలో గౌరవించాడు. టీమిండియా డ్రెసింగ్ రూమ్‌కు వెళ్లే సందర్భంలో సిరాజ్‌ను జట్టును లీడ్ చేయమని చెప్పాడు. ఆసీస్‌తో మ్యాచ్ సందర్భంగా టీ విరామం సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. టీ విరామం ఇవ్వడంతో భారత కెప్టెన్ రహానే.. సిరాజ్ వద్దకు వెళ్లి 'నువ్వు ముందు వెళ్లు.. నీ వెనకాల మేము వస్తాం' అని చెప్పాడు. రహానే చెప్పినట్లుగా సిరాజ్ ముందు నడవగా.. జట్టు మొత్తం అతని వెనకాల నడిచింది. టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన సిరాజ్‌కు మేము ఇచ్చే గౌరవం ఇదేనని రహానే తెలిపాడు.

సోషల్ మీడియాలో హర్షం:
అజింక్య రహానే చేసిన మంచి పనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. కెప్టెన్‌కు ఉండే అన్ని లక్షణాలు రహానేలో ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. 'ఒక డెబ్యూ ఆటగాడిని ఇలా గౌరవించడం రహానేకు మాత్రమే చెల్లింది'.. 'రహానే చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఐపీఎల్ 2020లో కూడా రోహిత్ శర్మ కూడా ఇలానే చేసిన విషయం తెగెలిసిందే.
India vs Australia: జడేజా.. నువ్ తోపు!! గిల్ తోసేసినా పట్టేశావుగా (వీడియో)


Click it and Unblock the Notifications












