Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రస్తుత తరం పిల్లలు ధోనీ ఆటను గుర్తుంచుకోవద్దు.. మహీ బ్యాటింగ్‌ను ఫాలో కావొద్దు: జడేజా ఫైర్

Ajay Jadeja Says Do Not Want New Generation to Remember this MS Dhoni

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2020లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. సీఎస్‌కే బ్యాట్స్‌మన్‌లలో ఫాఫ్ డుప్లెసిస్ తప్ప ఏ ఒక్కరు కూడా ఆకట్టుకోలేదు. ఇక కెప్టెన్ ఎంఎస్ ధోనీ అయితే భారీ లక్ష్య ఛేదనలో కూడా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్నాడు. తనకంటే ముందుగా సామ్ కరన్, రవీంద్ర జడేజాలను ‌బ్యాటింగ్‌కు దింపుతున్నాడు. దీంతో మహీపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గంభీర్‌ విమర్శలు కురిపించగా.. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ అజయ్‌ జడేజా చేరాడు.

సంతోషంగా లేను:

సంతోషంగా లేను:

ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను ఉద్దేశిస్తూ తాజాగా అజయ్‌ జడేజా మాట్లాడుతూ సెటైర్లు వేశాడు. ప్రస్తుత తరం పిల్లలు మహీ ఆటను గుర్తుంచుకోవద్దంటూ ఎద్దేవా చేశాడు. గతంలో ధోనీకి, నేటి ధోనీకి చాలా తేడా ఉందని అభిప్రాయపడ్డాడు. క్రిక్‌బజ్‌లో గౌరవ్‌ కపూర్‌తో మాట్లాడిన అజయ్‌ జడేజా.. ధోనీ బ్యాటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను మళ్లీ అదే మాట చెబుతాను. మహీ బ్యాటింగ్‌ స్థానం పట్ల సంతోషంగా లేను. వెనుక ఉండి పోరాడితే యుద్ధం ఎలా గెలుస్తాం. రాజు అనేవాడు వైదొలిగితే యుద్ధం ముగుస్తుందనే నానుడి ఉంది. ఇప్పుడు సీఎస్‌కే పరిస్థితి కూడా అలానే ఉంది' అని జడేజా సెటైర్లు వేశాడు.

అప్పుడు ధోనీ గ్రేట్.. ఇప్పుడు కాదు:

అప్పుడు ధోనీ గ్రేట్.. ఇప్పుడు కాదు:

'అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలిగిన ఎంఎస్ ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథిగా ఉన్నాడు. ప్రస్తుతం పిల్లలు క్రికెట్‌ను టీవీల్లో చూస్తూ మహీ గుర్తుకు తెచ్చుకుంటారు. ఐపీఎల్‌ 2020లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఏడు, ఆరు స్థానాల్లో బరిలోకి దిగిన ధోనీని గుర్తుంచుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. నేను మహీ బ్యాటింగ్‌ పొజిషన్‌తో కానీ, ఆటతో కానీ ఏమాత్రం సంతోషంగా లేను అనే విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నా. ఐపీఎల్ 2020కి ముందు వరకూ ఎంఎస్ ధోనీ గ్రేట్ క్రికెటర్‌.. ఇప్పుడు మాత్రం కాదు' అని అజయ్ జడేజా పేర్కొన్నాడు.

ఆ పరుగులు వ్యక్తిగతం కోసం చేసుకున్నవే:

ఆ పరుగులు వ్యక్తిగతం కోసం చేసుకున్నవే:

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ తీరుపై గౌతమ్ గంభీర్‌ విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే. '217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడమా?, అదికూడా మ్యాచ్‌ దాదాపు చేయిదాటి పోయిన సమయంలో. ఇది నన్ను ఆశ్చర్యపరిచింది. రుతురాజ్, కరన్‌ను ముందు పంపడం, ధోనీ ఏడోస్థానంలో రావడం అర్థరహితం. సురేష్ రైనా లేని సమయంలో వారిని ముందు పంపితే.. ధోనీ కంటే వారే బాగా ఆడాతారని సంకేతాలు ఇస్తున్నట్టుంది. చివరి ఓవర్లో ధోనీ మూడు సిక్సర్లు కొట్టినా ఉపయోగం ఏమీ లేదు. అవి అతడి వ్యక్తిగతం కోసం చేసుకున్నవి. జట్టును ముందుండి నడిపించాలి. ప్రతి మ్యాచ్ ‌గెలిచేందుకు ప్రయత్నించాలి. కానీ రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ధోనీలో ఆ ఉద్దేశం కనబడలేదు' అని గౌతీ ఫైర్ అయ్యాడు.

12 బంతుల్లో 15:

12 బంతుల్లో 15:

శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచులో ఢిల్లీ చేతిలో చెన్నై ఘోర పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పృథ్వీ షా (64; 43 బంతుల్లో 9×4, 1×6), శిఖర్ ధావన్‌ (35; 27 బంతుల్లో 3×4, 1×6), రిషభ్ పంత్‌ (37*; 25 బంతుల్లో 5×4), శ్రేయస్‌ అయ్యర్‌ (26; 22 బంతుల్లో 1×4) రాణించారు. ఛేదనకు దిగిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లిద్దరూ 34 పరుగుల్లోపే ఔటయ్యారు. ధోనీ (15; 12 బంతుల్లో 2×4) నిరాశపరిచాడు. డుప్లెసిస్‌ (43; 35 బంతుల్లో 4×4) ఒక్కడే రాణించాడు. దాంతో చెన్నై 131/7 పరుగులకే పరిమితమైంది. ఇక్కడ కూడా మహీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో లేటుగానే వచ్చాడు.

Story first published: Saturday, September 26, 2020, 21:10 [IST]
Other articles published on Sep 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+