For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పిచ్ పెళ్లాంలాంటిది గురూ!..ముందొకలా.. తర్వాత మరోలా..' - స్టార్ క్రికెటర్‌ను తిడుతోన్న జనాలు

పిచ్ ను పెళ్లి, పెళ్లాంతో పోలుస్తూ ఓ భారత మాజీ క్రికెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. భార్యలను అలా పోల్చడం సరైన పద్దతి కాదంటూ అభిప్రాయాలు వ్యక్తమత్తవుతున్నాయి. ఇంతకీ ఆ మాజీ క్రికెటర్ ఎవరంటే?

తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీమ్‌ అక్రమ్‌ ఓ క్రీడా ఛానల్‌ షోలో పాల్గొని సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే అజయ్‌ జడేజా మాట్లాడుతూ.. "పిచ్‌ రిపోర్ట్‌ గురించి ఓ విషయం చెబుతా వినండి. ఇక్కడ ప్రతిఒక్కరికీ పెళ్లైంది. పిచ్ రిపోర్ట్ కూడా పెళ్లి లాంటిదే. పెళ్లికి ముందు ఓ విషయం చూస్తారు. పెళ్లయ్యాక అసలు విషయం ఏంటనేది అర్థమవుతుంది" అని అన్నాడు. అంతే ఈ వ్యాఖ్యలు క్షణాల్లో నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Ajay Jadeja Compares Pitch is like Marriage Comments goes viral in champions trophy 2025

ఈ క్రమంలోనే జడేజా చేసిన ఈ వ్యాఖ్యలపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ వివరణ అడిగాడు. దీనికి కూడా ఆసక్తిరమైన సమాధానం ఇచ్చాడు జడేజా. "మేం పిచ్‌ గురించి చర్చించుకుంటున్నాం. పిచ్ గురించి వివరించే క్రమంలో దాన్ని కప్పి ఉంచే హోవర్‌ కవర్ ను - బంధువులతో పోల్చాను. ఎందుకంటే అరేంజ్డ్ మ్యార్యేజ్ ను కుదుర్చడం కోసం బంధువులు ఏం చేస్తారనేది ఉదాహరణగా చెప్పాను. పెళ్లి తర్వాత కూడా వాళ్లు గమనిస్తూనే ఉంటారు. పురుషులు, మహిళలు.. ఇద్దరి విషయంలో ఇది జరుగుతుంది. ఆ రోజు స్త్రీలను ఉద్దేశిస్తూ సరదాగా చెప్పాను. కానీ,ఇది భర్తలకు కూడా వర్తిస్తుంది." అని జడేజా వివరణ ఇచ్చాడు.

Story first published: Saturday, March 1, 2025, 17:48 [IST]
Other articles published on Mar 1, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+