
ధోనీని కలిసిన అజయ్
ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు దిగ్గజాలను చూడటం సంతోషంగా ఉందని ఎంఎస్ ధోనీ, అజయ్ దేవ్‌గణ్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ పోస్టుకు 46,000 లైక్‌లు వచ్చాయి. అలాగే 9.4 వేల మంది రీట్వీట్‌లు చేసారు. మరికొందరు వీరిద్దరిపై జోకులతో కూడిన మీమ్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటించిన చారిత్రక చిత్రం 'తన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్' ఈ రోజు విదలయింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ధోనీని అజయ్ కలిశారు. ఆ ఫొటోను అజయ్ పోస్ట్ చేశారు.

ఇద్దరు చించేశారు
అజయ్ దేవగణ్ పోస్టుపై హీరో సునీల్ శెట్టి స్పందించారు. 'కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్. ఫొటోలో ఇద్దరు చించేశారు' అని ట్వీట్ చేసారు. దిల్‌వాలే (1994), ఎల్‌ఓసి కార్గిల్ (2003), ఖయామత్: సిటీ అండర్ థ్రెట్ (2003), బ్లాక్‌మెయిల్ (2005), టాంగో చార్లీ (2005) సహా పలు చిత్రాల్లో సునీల్-అజయ్ కలిసి నటించిన విషయం తెలిసిందే.

ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్
అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటించిన చారిత్రక చిత్రం 'తన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్'. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. కాజోల్, శరద్ కేల్కర్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఓం రౌత్ తెరకెక్కించారు. అజయ్ దేవ్‌గన్ ఫిలింస్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మించారు.

తన్హాజీ పాత్రలో అజయ్
శివాజీ మహారాజ్‌తో కలిసి మరాఠా ప్రజల కోసం పోరాడిన సైన్యాధ్యక్షుడైన తన్హాజీ మలుసరే 1670వ సంవత్సరంలో జరిగిన సింహగఢ్ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. అటువంటి గొప్ప యోధుడి పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. శరద్ కేల్కర్ ఛత్రపతి శివాజీగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు షీలార్ మామ అనే పాత్రలో నటిస్తున్నారు.

తాత్కాలిక విరామం
గురువారం వరకు అజయ్ తన సినిమా తన్హాజీ ప్రమోషన్‌లో బిజిగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి విరామం తీసుకొని విశ్రాంతి తీసుకున్నారు. ఇటీవల ధోనీ రిటైర్మెంట్‌పై వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఆయన నేరుగా ఐపీఎల్లో ఆడుతాడని సమాచారం తెలుస్తోంది. అయితే ధోనీ వన్డేల నుంచి పూర్తిగా తప్పుకొని టీ20లపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు భారత కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్య చేశాడు.


Click it and Unblock the Notifications
