For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్‌ను హేళన చేస్తూ ఎయిర్ న్యూజిలాండ్ ట్వీట్, ఆ తర్వాత తొలగింపు

By Nageshwara Rao
Air New Zealand have a cheeky offer for Steve Smith

హైదరాబాద్: బాల్ టాంపరింగ్‌కు పాల్పడి దేశం పరువు తీసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక, బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన కామెరాన్‌ బాన్‌క్టాఫ్ట్‌పై తొమిది నెలల నిషేధం విధించింది.

ఈ నిషేధంతో స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌లు ఏడాది పాటు, బాన్‌క్రాఫ్ట్‌ 9 నెలలు అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌లకు దూరమయ్యారు. మళ్లీ వీళ్లు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేది వచ్చే ఏడాది మార్చిలోనే. బాల్ టాంపరింగ్ ఘటనపై నెటిజన్లు స్మిత్, వార్నర్‌లపై సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేశారు.

తాజాగా ఎయిర్ న్యూజిలాండ్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్‌, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లను ఉద్దేశించి హేళనగా ట్వీట్ చేసింది. న్యూజిలాండ్‌లో మేజర్ ఎయిర్ లైన్స్‌లో ఒకటైన ఎయిర్ న్యూజిలాండ్ తన ట్విట్టర్‌లో క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే రెండో టెస్టుకి ఆహ్వానిస్తూ ఓ వీడియోని పోస్టు చేసింది.

అందులో 'హే స్టీవ్ స్మిత్... నువ్వు స్వదేశానికి వస్తున్నట్లు తెలిసింది. నాటీ బాయ్, మా కుర్రాళ్లు నీకంటే బాగా ఆడుతున్నారు. ఈ శుక్రవారం, క్రైస్ట్ చర్చ వేదికగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్ జరగనుంది. స్వింగ్ బౌలింగ్‌పై నీ అభిప్రాయం ఏంటీ? ఆస్ట్రేలియాతో పోలిస్తే ఇక్కడ కూల్‌గా ఉంటుంది. స్వదేశంలో నువ్వు ఎదుర్కోబోయే విమర్శల నుంచి తప్పించుకోవడానికి ఇదే సులువైన మార్గం. వార్నర్, బాన్‌క్రాప్ట్ కూడా రావచ్చు' అని పేర్కొంది.

అయితే ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ తర్వాత ఎయిర్ న్యుజిలాండ్ డిలీట్ చేసింది. బాల్ టాంపరింగ్ వివాదంతో స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లు ప్రపంచ క్రికెట్ ముందు దోషులుగా నిలబడటంతో పాటు చెడ్డపేరు తెచ్చుకున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా వీరిపై కఠినంగా చర్య తీసుకుంది.

స్మిత్, వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం విధించగా... బాన్‌క్రాప్ట్‌పై 9 నెలల పాటు నిషేధం విధించింది. దీంతో పాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది. ఈ వివాదానికి సూత్రధారి అయిన డేవిడ్‌ వార్నర్‌ ఎన్నటికీ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌ కాలేడని సీఏ స్పష్టం చేసింది. అయితే, కెప్టెన్సీ విషయంలో స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌కు ఒకింత ఊరటనిచ్చింది.

ఆస్ట్రేలియా కెప్టెన్సీని చేపట్టకుండా స్మిత్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. ఈ రెండేళ్ల కాలంలో దేశీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో వీరు కెప్టెన్సీ చేపట్టరాదని పేర్కొంది. అయితే, ఆ తర్వాత క్రికెట్‌ అభిమానుల నుంచి, అధికారుల నుంచి అనుమతి, ఆమోదం ఉంటే జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టవచ్చునని పేర్కొంది. క్రికెట్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోకుండా వీరు క్లబ్‌ క్రికెట్‌ ఆడుకునేందుకు అనుమతించింది.

Story first published: Thursday, March 29, 2018, 15:50 [IST]
Other articles published on Mar 29, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+