Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నేనూ అందరిలానే.. డైమండ్స్ అంటే చాలా ఇష్టం'

Aims to play 2021 World Cup: Mithali Raj

హైదరాబాద్: ప్రముఖ డైమండ్స్ కంపెనీకి అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న మిథాలీ రాజ్.. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడింది. 'బంగారు ఆభరణాలు మహిళలకు వీటిపై ఎంతో మమకారం. ఏదైనా వేడుకకు వెళ్లేటప్పుడు మాత్రం అందుకు తగ్గట్టుగా ఆభరణాలను ధరిస్తా'నని చెబుతోంది ప్రముఖ బంగారు ఆభరణాల షోరూం జోయలుక్కాస్‌లో అందుబాటులోకి తీసుకువచ్చిన ఆస్ట్రేలియా డైమండ్స్‌ కలెక్షన్‌కు ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్‌లో మాట్లాడారు.

బాల్యం నుంచి నగలు పెట్టుకోవడం చాలా అరుదు:

బాల్యం నుంచి నగలు పెట్టుకోవడం చాలా అరుదు:

క్రికెట్‌ ఆటతో బాల్యం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. అలాగే నగలు పెట్టుకోవడం కూడా చాలా అరుదు. భారతదేశంలో ఏ ఆడపిల్లకైనా నగలంటే ప్రాణం. అందులో నేను ఒకదాన్ని. ఫలానా ఆభరణాలంటూ ఏమీ లేదు గానీ అన్ని రకాల నగలను ఇష్టపడతా. సందర్భాన్ని బట్టి వాటిని ధరిస్తా. ఆడపిల్లలు ఏ రంగంలోనైనా రాణించే సత్తా ఉంది. కొందరు తల్లిదండ్రులు కట్టుబాట్ల పేరుతో ఆటలకు దూరం చేస్తున్నారు. ఇది సరికాదు. తల్లిదండ్రుల్లో చైతన్యం రావాలి. తమ పిల్లలకు ఇష్టమైన గేమ్‌లో ప్రోత్సాహాన్ని అందించాలి. భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీరాజ్‌. ఇప్పుడిప్పుడే క్రీడల పట్ల అమ్మాయిలు ఆసక్తి కనబరచడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.

పెళ్లికి ఇంకా... టైం ఉంది:

పెళ్లికి ఇంకా... టైం ఉంది:

తన పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఇంకా సమయం ఉందంటూ నవ్వులు చిందించారు. పెళ్లికి ఇంకా సమయం ఉంది. లవ్‌ మ్యారేజా, పెద్దలు కుదిర్చిందా..? అంటే చెప్పలేను. ప్రస్తుతం నా ధ్యాసంతా క్రికెట్‌పైనే. వివిధ దేశాలతో క్రికెట్‌ ఆడేటప్పుడు ఆయా దేశాల మధ్య సత్సంబంధాలు ఎంతో బలపడతాయి. జోయలుక్కాస్‌ ఆస్ట్రేలియా డైమండ్స్‌ను సామాన్య, మధ్యతరగతి కుటుంబీలకు కూడా అందుబాటులో ఉండేలా నగరవాసుల ముంగిటకు తీసుకురావడం సంతోషదాయకం.

ఆస్ట్రేలియా అనుబంధంతోనే బ్రాండ్‌ అబాసిడర్‌గా

ఆస్ట్రేలియా అనుబంధంతోనే బ్రాండ్‌ అబాసిడర్‌గా

ఇప్పటివరకు క్రికెట్‌తో ఆస్ట్రేలియాతో అనుబంధం ఉండగా, ప్రస్తుతం డైమండ్స్‌తో మరో బంధం ఏర్పడినట్లయ్యింది. అందుకే బ్రాండ్‌ అబాసిడర్‌గా ఉండాలనగానే ఒప్పుకొన్నాను. ఇప్పుడు జోయలుక్కాస్‌ ఆస్ట్రేలియా డైమండ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాను. భవిష్యత్తులో అదే జ్యువెలరీ వ్యాపారంలోకి దిగుతానేమో (నవ్వుతూ). ప్రస్తుతం అకాడమీ ఏర్పాటు ఆలోచన లేదు కానీ భవిష్యత్‌లో ఎప్పటికైనా స్థాపించడం మాత్రం ఖాయం.

అకాడమీల్లో చేరుతున్నారు కానీ.. పాఠశాలల్లో:

అకాడమీల్లో చేరుతున్నారు కానీ.. పాఠశాలల్లో:

క్రికెట్‌లోకి ప్రవేశించే నాటికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చాలా తక్కువ. నేను చదివిన కీస్‌ హైస్కూల్‌ మైదానం, జింఖానా మైదానమే నాకు తెలుసు. ఇప్పుడు కొత్తగా అకాడమీలు అందుబాటులోకి వచ్చాయి. క్రీడాకారులకు అవసరమైన వసతులు పెరిగాయన్నది కచ్చితంగా చెప్పగలను. క్రీడా రంగం విషయానికొచ్చేసరికి దేశంలో ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎక్కువగా ఉంది. యువత తమను తాము మౌల్డ్‌ చేసుకుంటున్నారు. యువత అనుకున్న స్థాయిలో క్రీడారంగం వైపు రాలేకపోతున్నారు. ప్రస్తుతం ఎక్కువ శాతం పాఠశాలలకు సరైన క్రీడా మైదానాలు లేకపోవడం, పిల్లలను ఆటలకు దూరం కావడం జరుగుతుంది. కళాశాల స్థాయి వచ్చేవరకు కూడా వారికి క్రీడల్లో రాణించలేకపోతున్నారు.

Story first published: Tuesday, August 7, 2018, 12:46 [IST]
Other articles published on Aug 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+