న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'వెస్టిండీస్‌ పర్యటనలో విరాట్‌ కోహ్లీలా నిలకడగా ఆడాలనుకుంటున్నా'

Team India's West Indies Tour 2019 : Krunal Pandya Reveals What He Wants To Learn From MS Dhoni
Aims at consistency: Krunal Pandya Reveals What He Wants To Learn From The Indian Captain Virat Kohli

వెస్టిండీస్‌ పర్యటనలో భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీలా నిలకడగా ఆడాలనుకుంటున్నా. ఓపికగా మ్యాచ్‌లు ముగించడాన్ని మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నుండి నేర్చుకుంటా అని టీమిండియా ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా తెలిపారు. వెస్టిండీస్‌ పర్యటనకు హార్దిక్‌ పాండ్యాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే అతని స్థానంలో సోదరుడు కృనాల్‌ పాండ్యాకు టీ20 జట్టులో చోటు కల్పించారు. భారత్‌-ఏ జట్టు తరఫున వెస్టిండీస్‌ పర్యటనలో అదరగొట్టడంతో భారత జట్టులో కృనాల్‌ చోటు దక్కించుకున్నాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

వెస్టిండీస్‌ పర్యటన కోసం ఎదురు చూస్తున్నా:

వెస్టిండీస్‌ పర్యటన కోసం ఎదురు చూస్తున్నా:

ఈ సందర్భంగా బీసీసీఐ టీవీతో కృనాల్‌ పాండ్యా మాట్లాడాడు. 'వెస్టిండీస్‌ పర్యటన కోసం ఎదురు చూస్తున్నా. ఈ సిరీస్‌ అనంతరం టీమిండియా చాలా క్రికెట్‌ ఆడనుంది. ఈ సిరీస్‌లో బ్యాటు, బంతితో నిలకడగా రాణించాలని పట్టుదలతో ఉన్నా. నా శక్తి మేరకు రాణించేందుకు ప్రయత్నిస్తా' అని కృనాల్‌ అన్నాడు.

కోహ్లీలా నిలకడగా ఆడాలనుకుంటున్నా:

'భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ నుంచి తీరని దాహం, నిలకడగా ఆడడం నేర్చుకోవాలి. అన్ని ఫార్మాట్లలో నిలకడగా పరుగుల వరద పారిస్తాడు. అతనిలా నిలకడగా ఆడాలనుకుంటున్నా. ధోనీ అత్యుత్తమ ఫినిషర్‌. ఎటువంటి పరిస్థితులలో అయినా జట్టు కోసం పోరాడతాడు. మ్యాచ్‌లు ముగించడాన్ని ధోనీ నుంచి నేర్చుకొంటా' అని కృనాల్‌ తెలిపారుడు.

ఐపీఎల్‌ నా జీవితాన్నే మార్చేసింది:

ఐపీఎల్‌ నా జీవితాన్నే మార్చేసింది:

'ఐపీఎల్‌ నా జీవితాన్నే మార్చేసింది. ముంబై ఇండియన్స్‌కు ఆడటం అతిపెద్ద మలుపు. ఐపీఎల్‌లో నా ఆటను ప్రదర్శించాను. ఐపీఎల్‌లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎంతో కష్టపడాలి. కష్టపడి ఐపీఎల్‌ విజేతగా నిలిస్తే ఎంతో సంతృప్తి కలుగుతుంది. భారత్‌-ఏ తరఫున పర్యటించడం ఉపయోగపడింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌లో ఆడాను. ఆ అనుభవం ఎప్పటికీ ఉపయోగపడుతుంది' అని కృనాల్‌ చెప్పుకొచ్చారు.

టీ20 జట్టు:

టీ20 జట్టు:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్ పంత్‌ (వికెట్‌ కీపర్‌), కృనాల్‌ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌సైనీ.

Story first published: Tuesday, July 23, 2019, 10:43 [IST]
Other articles published on Jul 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X