For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిక్సు షాట్‌ను స్టేడియం నుంచి క్యాచ్ అందుకున్న అభిమాని(వీడియో)

Aiden Markram Dispatches Mitchell Starc's 150Kph Thunderbolt,Fan Catches It | Oneindia Telugu
Aiden Markram tonks a huge six off Mitchell Starcs 150kph delivery, leaves crowd amazed

హైదరాబాద్: సఫారీలు మ్యాచ్ ఓడినా మార్క్‌రమ్ కొట్టిన షాట్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ అడిలైడ్‌ స్టేడియంలో శుక్రవారం జరిపిన ప్రదర్శన పేలవంగా ముగిసింది. దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 7 పరుగుల తేడాతో గెలుపొందినా.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌ని సఫారీ బ్యాట్స్‌మెన్ ఉతికారేశారు.

ముఖ్యంగా.. మార్క్‌రమ్ (19: 17 బంతుల్లో 2ఫోర్లు, 1 సిక్సు) బాదిన ఓ సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. 150.8 కిమీ వేగంతో మిచెల్ స్టార్క్ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతిని విసరగా.. మిడ్ వికెట్ దిశగా దాన్ని మర్‌క్రమ్ స్టాండ్స్‌లోకి తరలించేశాడు. 95 మీటర్ల దూరంలో పడిన ఆ బంతిని.. స్టాండ్స్‌లో ఓ అభిమాని క్యాచ్‌గా అందుకుని కొన్ని క్షణాలు సంబరాలు చేసుకున్నాడు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్.. ఆస్ట్రేలియాని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కెప్టెన్ అరోన్ ఫించ్ (41: 63 బంతుల్లో 4ఫోర్లు), క్రిస్‌లిన్ (44: 44 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సు), అలెక్స్ కారీ (47: 72 బంతుల్లో 4ఫోర్లు) ఫర్వాలేదనిపించినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 48.3 ఓవర్లలో 231 పరుగులకి ఆలౌటైంది. సఫారీ బౌలర్లలో రబాడ 4 వికెట్లు పడగొట్టగా.. ప్రిటోరియస్ 3 వికెట్లు తీశాడు.

స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడిన దక్షిణాఫ్రికా జట్టు 14.4 ఓవర్లు ముగిసే సమయానికే డికాక్ (9), మకరమ్ (16), హెండ్రిక్స్ (19), హెన్రిచ్ (14) వికెట్లు కోల్పోయి 68/4తో ఇబ్బందుల్లో పడింది. ఒత్తిడిలోనే ఆఖరికి 224/9కే పరిమితమై పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆఖరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా జట్టు విజయానికి 20 పరుగులు అవసరంకాగా.. స్పిన్నర్ మాక్స్‌వెల్ బౌలింగ్‌లో తాహిర్ రెండు ఫోర్లు బాదినా.. ఆఖరికి 12 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆస్ట్రేలియా జట్టులో స్టాయినిస్ మూడు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Saturday, November 10, 2018, 12:20 [IST]
Other articles published on Nov 10, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+