
హైదరాబాద్: తొలి వన్డేలో సారథి డుప్లెసిస్ చూపుడు వేలికి గాయం కావడంతో అతడు టోర్నీ నుంచి తప్పుకున్నాడు. మొదటి వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా డుప్లెసిస్‌కు కుడి చేతి చూపుడు వేలు విరిగింది. మూడు నుంచి ఆరువారాల పాటు విశ్రాంతి అవసరమని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు పేర్కొంది. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు గాయపడటంతో కెప్టెన్ ఎవరా అనే సందిగ్ధం నెలకొంది.
ఆరు వారాల పాటు తాత్కాలిక సారథిగా:
ఈ తరుణంలో అనూహ్యంగా తాత్కలిక కెప్టెన్‌గా మర్‌క్రామ్‌ను ప్రకటించింది. ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగే మిగతా ఐదు వన్డేల్లో దక్షిణాఫ్రికాను అయిడెన్ మార్ర్కమ్ నడిపించనున్నాడు. సీనియర్ డివిలియర్స్ సైతం అందుబాటులో లేడు. ఈ నేపథ్యంలో 2014 అండర్-19 ప్రపంచకప్ విజేతగా దక్షిణాఫ్రికాను నిలిపిన మార్ర్కమ్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు తాత్కాలిక సారథిగా నియమించింది.
జట్టులోకి మరో క్రీడాకారుడు:
డుప్లెసిస్ స్థానంలో ఫర్హాన్ బెహర్డీన్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. వన్డే సిరీస్ మొత్తానికి మర్ క్రామ్ నాయకత్వం వహించనున్నాడని క్రికెట్ దక్షిణాఫ్రికా కన్వీనర్ లిండాజొండి తెలిపారు. ఇది కష్టమైన నిర్ణయమేమి కాదని, మరక్రమ్‌కు డివిలియర్స్, ఇతర సీనియర్ ఆటగాళ్లు అండగా ఉంటారని పేర్కొన్నారు.
ఒత్తిడి తట్టుకోగలం: మార్ర్కమ్
అనుభవం లేకున్నా జట్టు పగ్గాలను తనకు అప్పగించడాన్ని గౌరవంగా భావిస్తానని మార్ర్కమ్ అన్నాడు. నాయకత్వ బాధ్యతలు మీద పడడంతో తనపై కాస్త ఒత్తిడి ఉందన్నాడు. దీనిని తాను అధిగమించగలనని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆదివారం మ్యాచ్ జరిగే సెంచూరియన్ పిచ్ బాగుందని ఆఖరి ఓవర్లలో తమ బౌలర్లు రాణిస్తారని వెల్లడించాడు.
మిడిలార్డర్‌లో నాణ్యమైన బ్యాట్స్‌మెన్ ఉన్నారని బాధ్యతగా ఆడటమే ముఖ్యమన్నాడు. టాప్ ఆర్డర్‌లో హషీమ్ ఆమ్లా అద్భుతంగా ఆడతాడని, ప్రశాంతంగా పరుగులు చేస్తాడని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు మార్క్రమ్ కేవలం రెండు వన్డేల్లో మాత్రమే ఆడాడు. 2017 అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌పై అరంగేట్రం చేశాడు. ఆరు టెస్టులు ఆడాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.