Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS ENG: కుంభమేళలో కోహ్లీ, రోహిత్.. సంజూ, సూర్యకుమార్ కూడా!!

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నసంగతి తెలిసిందే. గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణి సంగమంలో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.

ఈ క్రమంలోనే మన టీమిండియా స్టార్ క్రికెటర్లు కూడా ఈ మహా కుంభమేళాను సందర్శించారంటూ!.. కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంగ్లాండ్ తో రెండు టీ20 ప్రారంభం ముందు సంజూ శాంసన్, సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ కుంభమేళాను సందర్శించినట్లు ఫొటోలు కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలు చూస్తే వారు నిజంగానే సందర్శించినట్లు అనిపించేలా ఉన్నాయి.

AI Avatars TeamIndia Cricketers As Sadhus MS Dhoni Kohli Rohith Sanju Surya kumar photos goes viral

అయితే ఇదంతా ఏఐ(కృత్రిమ మేధ) మాయ. దీని సాయంతోనే ఈ మధ్య కాలంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఎన్నో చిత్రాలు, వీడియోలు కూడా ఈ మధ్య కాలంలో నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మన టీమిండియా స్టార్ క్రికెటర్లు కుంభమేళాను దర్శించుకున్నట్లుగా ఫొటోలను క్రియేట్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'క్రికెటర్లు మహా కుంభమేళాకు వెళితే' అని క్యాప్షన్ రాసి వాటిని పోస్ట్ చేశారు. అవి నెటిజన్లను, క్రికెట్ ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఫొటోల్లో స్టార్ క్రికెటర్లు ధోనీ, రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు హార్దిక్‌ పాండ్య, బుమ్రా, రిషభ్ పంత్, సంజూ శాంసన్, జైశ్వాల్, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ తదితరులు కాషాయ దుస్తుల్లో కనిపించారు. వీరంతా కుంభమేళాను దర్శించుకున్నట్లుగా ఫొటోలను క్రియేట్ చేశారు. మీరు ఓసారి ఈ ఫొటోస్ ను సరదాగా చూసేయండి.

Story first published: Saturday, January 25, 2025, 10:14 [IST]
Other articles published on Jan 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+