న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్‌తో సిరిస్: పాక్‌కు ఊహించని దెబ్బ, షెజాద్‌పై 4 నెలల నిషేధం

Pak Batsman Ahmed Shehzad Gets Ban For Four-Months
 Ahmed Shehzad: Pakistan batsman banned for four months for positive test

హైదరాబాద్: దుబాయి వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో సిరిస్‌కు సిద్ధమవుతున్న పాకిస్థాన్‌‌కు ఇది ఊహించని దెబ్బ. ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ అహ్మద్‌ షెజాద్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నాలుగు నెలల నిషేధం విధించింది. డోపింగ్‌ టెస్టులో విఫలం కావడంతో అతనికి ఈ శిక్ష విధించినట్లు పీసీబీ తెలిపింది.

<strong>చరిత్రలో అత్యంత వివాదాస్పద 'బాడీలైన్‌' సిరీస్‌ గురించి షేన్ వార్న్</strong>చరిత్రలో అత్యంత వివాదాస్పద 'బాడీలైన్‌' సిరీస్‌ గురించి షేన్ వార్న్

ఈ ఏడాది మే నెలలో పాకిస్థాన్‌ దేశవాళీ టోర్నీ సందర్భంగా అహ్మద్‌ షెజాద్‌ నిషేధిత ఉత్ప్రేరకాన్ని వాడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో పీసీబీ ఈ జులై 10 నుంచి అతన్ని తాత్కాలికంగా నాలుగు నెలలు పాటు సస్పెండ్‌ చేసింది. 26 ఏళ్ల అహ్మద్‌ షెజాద్‌ పాక్ తరుపున 13 టెస్టులు, 81 వన్డేలు, 57 టీ20లాడాడు.

అయితే తాను కావాలనే ఈ ఉత్ప్రేరకాన్ని వాడలేదని అతను చెప్పినట్లు పీసీబీ తన ప్రకటనలో పేర్కొంది. షెజాద్‌ చివరిగా ఈ జూన్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు. ఈ మ్యాచ్‌లో అహ్మద్‌ షెజాద్‌ చేసిన 38 పరుగులు జట్టు విజయంలో కీలకమయ్యాయి.

2013లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అహ్మద్‌ షెజాద్‌ ఇప్పటివరకు 13 టెస్టు మ్యాచ్‌లాడి 983 పరుగులు చేశాడు. మే 2017లో పాక్ తరుపున తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.

Story first published: Saturday, October 6, 2018, 13:20 [IST]
Other articles published on Oct 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X