Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తప్పక చూడాల్సిందే: అహ్మద్ షెజాద్ కళ్లు చెదిరే క్యాచ్‌ (వీడియో)

Ahmad Shahzad Stunning Unbelievable Catch Today National T20 Cup 2017

హైదరాబాద్: 'క్యాచెస్ విన్ మ్యాచెస్' అంతర్జాతీయ క్రికెట్‌లో ఈమాటను మనం ఎప్పటినుంచో వింటున్నాం. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని అద్భుతమైన క్యాచ్‌లు మ్యాచ్ గతినే మార్చేస్తున్నాయి. అభిమానులు సైతం ఆ క్యాచ్‌ల గురించి మాట్లాడకునేలా చేస్తున్నాయి.

తాజాగా లాహోర్ బ్లూస్, పెషావర్ టీమ్స్ మధ్య శనివారం జరిగిన ఓ స్థానిక మ్యాచ్‌లో అహ్మద్ షెజాద్ బౌండరీ దగ్గర పట్టిన స్టన్నింగ్ క్యాచ్ పట్టిన తీరు చూసి క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ముసాదిక్ అహ్మద్ కొట్టిన షాట్‌ను బౌండరీ దగ్గర డైవ్ చేస్తూ షెజాద్ సూపర్ క్యాచ్ పట్టుకున్నాడు.

ఇప్పుడు ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటిదే ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అందుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో పాండ్యా ఈ క్యాచ్ అందుకున్నాడు.

ఈ వీడియో చూసిన అభిమానులు పాండ్యాని 'సూపర్ మ్యాన్'తో పోల్చారు. యజువేంద్ర చాహల్‌ వేసిన 1.3వ బంతికి గుప్టిల్ (4) అవుటయ్యాడు. లాంగాఫ్‌లో పరుగెత్తుకు వచ్చిన పాండ్యా గాల్లోకి అద్భుతంగా డైవ్‌ చేసి బంతిని ఒడిసి పట్టాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, November 19, 2017, 12:33 [IST]
Other articles published on Nov 19, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+